వెలుగోడు పట్టణంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే శిల్పా మాట్లాడుతూ మన అందరి ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం విద్యార్థుల చదువుల కోసం ఎంతో ఖర్చు చేస్తుందని తెలియజేశారు. 28వ తేదీన ‘అమ్మఒడి’ ద్వారా పిల్లలకు డైరెక్టుగా తమ తల్లి ఖాతాల్లోకి ఆర్థిక సహాయంగా నగదు రూపాయలు పడతాయని తెలియజేశారు. అంతేకాకుండా తెరిచిన రోజే ‘విద్యా కానుక’ కిట్లను పంపిణీ చేసిన ఘనత, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం చరిత్రలో వైఎస్ఆర్సిపి మాత్రమే అన్నారు. పిల్లలకు గోరుముద్ద, విద్యా కానుక కిట్లు, అమ్మఒడి, మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం, ఆంగ్ల మాధ్యమం, సీబీఎస్ఈ సిలబస్, ప్రత్యేక ఉపాధ్యాయులను అందించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న మహర్షి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అనేక కార్యక్రమాలు అందించే ప్రభుత్వం మనందరి ప్రభుత్వం అన్నారు. ఇప్పుడు మంచి నీళ్లు తాగడానికి మినరల్ వాటర్ కూడా ఇచ్చే మిషన్ కూడా మన ప్రభుత్వం అందించింది అన్నారు.
ఈ కార్యక్రమంలో వెలుగోడు మండల ప్రజా ప్రతినిధులు వైఎస్ఆర్ సీపీ నాయకులు, సచివాలయ కన్వీనర్లు, ఎంపీటీసీలు వార్డు మెంబర్లు ఉపాధ్యాయులు , వెలుగోడు ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ సభ్యులు ,కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Shilpa: మినరల్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
సంబంధిత వార్తలు | RELATED ARTICLES