Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: 'లా నేస్తం' ద్వారా 128 మందికి లబ్ధి

Kurnool: ‘లా నేస్తం’ ద్వారా 128 మందికి లబ్ధి

యువ లాయర్లు వృత్తిలో నిలదొక్కుకునేందుకు ..

కర్నూలు జిల్లాలో ‘వైఎస్సార్ లా నేస్తం’ పథకం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి విడతగా 128 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదులకు రూ.23,15,000/- లు బ్యాంకు ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేసినట్టు జిల్లా కలెక్టర్ డా.జి.సృజన తెలిపారు. వైఎస్సార్ లా నేస్తం ద్వారా ఫిబ్రవరి 2023 నుంచి జూన్ 2023 వరకు ఐదు నెలలకు సంబంధించిన మొత్తాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వైఎస్ఆర్ లా నేస్తం ప్రత్యక్ష ప్రసారాన్ని కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, ఎమ్మెల్సీ డా. మధుసూదన్, పత్తికొండ శాసనసభ్యులు కంగాటి శ్రీదేవి తదితరులు వీక్షించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ లా నేస్తం పథకం ద్వారా న్యాయ విద్య పూర్తి చేసిన యువ లాయర్లు వృత్తిలో నిలదొక్కుకునేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ న్యాయవాదులకు ఆర్థిక స్వావలంబన కల్పించాలనే సదుద్దేశంతో అక్టోబరు 2019 నుండి ఈ పథకం ప్రారంభించిందన్నారు. ఈ పథకం ద్వారా అర్హులైన న్యాయవాదులకు నెలకు 5వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తూ వారికి చేయూత అందజేయడం జరుగుతుందన్నారు.జూనియర్ న్యాయవాదులు న్యాయ వృత్తిలో ఇంకా రాణించేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. ఎమ్మెల్సీ డా.మధుసూదన్, పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ యువ న్యాయవాదులకు ప్రభుత్వం అండగా ఉంటూ వైఎస్సార్ లానేస్తం పథకాన్ని అమలు చేస్తోందన్నారు. న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలో 100 కోట్లతో అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసిందని, న్యాయవాదుల అవసరాలకు రుణాలు, గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీలు, ఇతర అవసరాల కోసం ఈ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే 25 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించిందని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్, పత్తికొండ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు రూ.23.15 లక్షల మెగా చెక్కును జూనియర్ న్యాయవాదులకు అందించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ నాసర రెడ్డి, మున్సిపల్ డిప్యూటీ కమీషనర్ రమాదేవి, సీనియర్ న్యాయవాది సత్యనారాయణమ్మ, న్యాయవాది అర్సియా పర్వీన్, డిఎల్డిఓ బాలకృష్ణ, జూనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News