జగనన్న సురక్ష పథకం ద్వారా వాలంటీర్లు అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి అర్హులైన వారందరికీ పథకం అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. దేవనకొండ మండలం చెల్లల చెలిమల గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమనికి గ్రామంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేసి, ప్రజలకు అందిస్తున్న సచివాలయ సేవల గురించి ఆరా తీశారు. సచివాల సిబ్బంది బాధ్యతతో విధులు నిర్వహించి ప్రజల నుండి మన్నలను పొందే విధంగా విధులు నిర్వహించాలన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల గడప వద్దకే ప్రభుత్వ సేవలు అందిస్తున్నాయి అన్నారు. ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి ప్రజలకు జవాబుదారి తనతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి అన్నారు. అనంతరం ప్రాధాన్యత భవనాలైన గ్రామ సచివాలయo మంజూరైన దాన్ని భూమి పూజ చేసి ప్రారంభించారు. జగనన్న సురక్ష పథకం అమలులో బాగంగా ప్రతి అధికారి, వాలంటీర్ ప్రతి ఇంటిని దర్శించి ఆ ఇంటిలో సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని వారి సమస్యలను మరింత వేగవంతంగా పరిష్కారానికై కృషి చేయాలని సచివాలయం సిబ్బంది, అధికారులను మంత్రి వర్యులు సూచించారు.
గ్రామంలో ఇంటింటిని దర్శించి ప్రభుత్వం చేసిన సంక్షేమం గురించి వివరిస్తూ వారి యోగక్షేమాలని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఏ విధమైన సమస్యలు ఉన్నాయి, వాలంటరీ సచివాలయ సిబ్బంది వ్యవస్థ ఎలా ఉంది సరిగ్గా పని చేస్తున్నారా లేదా అని గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. చెల్లల చెలిమీల పంచాయతీలో బేతుపల్లి, బంటుపల్లి, బండ పల్లి, చెల్లుల చేలిమిల, గ్రామాలకు సంక్షేమ పథకాలు ద్వారా దాదాపు 6.35 కోట్లు లబ్ది చేకూరిందన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి సోదరులు గుమ్మనూరు నారాయణ స్వామి, గుమ్మనూరు శ్రీనివాసులు, జడ్పీటీసీ కిట్టు, ఎంపీపీ భర్త లుముంబా, మండల కన్వీనర్ కప్పట్రాళ్ల మల్లికార్జున, నాయకులు నారాయణ రెడ్డి,మోహన్ రెడ్డి,ప్రేమనాధ్ రెడ్డి, దివాకర్ నాయుడు ఆ గ్రామాల నాయకులు నారాయణ, వెంకట్ రాముడు, తిమ్మారెడ్డి, గోవింద్, బంటుపల్లి సర్పంచ్ ప్రకాష్, ఎంపీటీసీ తనయుడు రామంజి, నాగేష్, ఎంపీడీవో గౌరీ దేవి, తహశీల్దార్ వెంకటేష్ నాయక్, జడ్పిటిసి రామకృష్ణ, సర్పంచ్ రామంజి, యం.పి.పి రామంజి, సచివాల సిబ్బంది పాల్గొన్నారు.