Friday, September 20, 2024
HomeతెలంగాణCongress: కాంగ్రెస్ లోకి మేఘా బలగం

Congress: కాంగ్రెస్ లోకి మేఘా బలగం

ఏ పార్టీలో చేరతారనే సస్పెన్స్ కు ఎట్టకేలకు తెర

పెద్దమందడి ఎంపీపీ మేఘా రెడ్డి అధికార బిఆర్ఎస్ ను వీడి ఏ పార్టీలో చేరతారనే సస్పెన్స్ కు ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్ పార్టీలో చేరాలంటే ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని పక్కనపెట్టి పార్టీలో పని చేయాలని లేదంటే పార్టీలోకి నో ఎంట్రీ అంటూ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల నుంచి ఇన్ని రోజులు అడ్డంకులు ఏర్పడ్డాయి. వీటన్నిటికీ తెర దించుతూ ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ల నేతృత్వంలో తెలంగాణకు చెందిన బిఆర్ఎస్ అసంతృప్త నేతలు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీని కలిశారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అన్ని విషయాలు చర్చించిన అనంతరం తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని అధికారంలో నుంచి దింపేందుకు గట్టిగా పోరాడాలని సూచిస్తూ పార్టీలో చేర్చుకునేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో రాష్ట్రానికి చెందిన 35 మంది ముఖ్య నేతల జాబితాను ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ విడుదల చేసింది. ఈ జాబితాలో వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డితో పాటు వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి పేర్లు ఉన్నాయి. వీరందరూ జూలై 2న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు రాహుల్ గాంధీ హాజరు కానుండడంతో ఆయన సమక్షంలోనే తెలంగాణకు చెందిన 35 మంది ముఖ్య నేతలతో పాటు వారి అనుచర గణమంతా అదేరోజు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకోనున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News