డ్రగ్స్ మాదక ద్రవ్యాల వినియోగం ప్రపంచానికి సామాజిక సమస్యగా పరిణమించింది. దేశ అభివృధిలో చోదక శక్తిగా నిలిచిన యువత డ్రగ్స్ ఆల్కహాల్ మాదక ద్రవ్యాల మత్తులో చిక్కుకొని తమ శక్తి సామర్ధ్యాలు నిర్వీర్యం చేసుకుంటున్నారు. డ్రగ్స్ మాదక ద్రవ్యాల దుర్వినియోగం యువత వినాశనకరంగ మారింది ఆశలు ఆకాంక్షలు కన్న కలలు విచ్చిన్నమై కుటుంబాలలో ఆ నందకరమైన జీవితానికి అవరోధం కావడం శోచనీయం. ఐ‘రా’స ప్రపంచ డ్రగ్స్ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా జరుపాలని 1987 నుండి ప్రపంచ వ్యాప్తంగా డ్రగ్స్ మాదక ద్రవ్యాల వినియోగం అరికట్టేందుకు సభ్యదేశాల ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీచేస్తూ మాదక ద్రవ్యాల మహమ్మారికి వ్యతిరేకంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. డ్రగ్స్ మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాల వినియోగం రావాణా వల్ల ఏర్పడే దుష్ఫలితాల పట్ల ప్రజలకు పౌరసమాజానికి అవగాహన చైతన్యం కలిగించడం ముఖ్య ఉద్దేశం.
పత్రికల్లో మీడియాలో డ్రగ్స్ మాదక ద్రవ్యాల వినియోగం వార్తలు సమాజాన్ని కలవరపెడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతుంది. చిన్న పట్టణాల నుంచి మెట్రోపాలిటన్ నగరాలకు డ్రగ్స్ వ్యాపారం మూడు పువ్వులు అరవై కాయలుగా కొనసాగుతుంది స్కూల్ కాలేజీ యూనివర్సిటీలు డ్రగ్స్. విక్రయ కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. డ్రగ్స్ మాదక ద్రవ్యాల వ్యాపారం మాఫియా యువతను నిర్వీర్యం చేస్తూ లక్షల కోట్ల చీకటి వ్యాపారం చేస్తున్నాయి. యువత మత్తుకు ఆకర్షితులై మత్తు నుండి బయట పడలేక తమ జీవితాలను బలిచేసుకుంటున్నారు. కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నరు.
పెరిగిన డ్రగ్స్ మాదక ద్రవ్యాల వినియోగం
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 269 మిలియన్ల మంది మాదక ద్రవ్యాలకు బానిస అయ్యారని నివేదికలు వెల్లడించాయి. వీరే కాకుండా ఎప్పుడన్నా ఒకసారి వినియోగించే వారు 5.5% మంది ఉన్నారు. దేశంలో మద్యం వినియోగించే వారు16 కోట్ల మంది గంజాయి 3.1 కోట్లు హీరో యిన్ 2.8 కోట్లు కోకైన్ ఇతర మత్తుపదార్తాలు 1.18 కోట్ల మంది వాడుతున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. డ్రగ్స్ మాదక ద్రవ్యాల వినియోగం ప్రపంచ వ్యాప్తంగా 2004 లో 21 శాతం వాడుతుంటే నేడు 29.5% పెరిగిందని యు’ఎన్’ఓ’డి’సి విడుదల చేసిన నివేదిక తెలిపింది. ఈ నివేదిక ప్రకారం మాదక ద్రవ్యాల వినియోగం వల్ల ప్రపంచ వ్యాప్తంగా అర మిలియను మంది 2019లో మరణిస్తే ఇండియాలో జరిగిన ఆత్మహత్యల్లో ఎక్కువ శాతం ఈ కోవకు చెందినవేనని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలు ఉపయోగించే వారు 0.71 శాతం ఉంటే ప్రపంచ సగటు కంటే ఎక్కువగా మన దేశంలో 2.65% ఈ ప్రమాదకరమైన డ్రగ్స్ వాడుతున్నారని నివేదిక పేర్కొంది 1985లో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకో ట్రాఫిక్ సబ్ స్టాన్సెస్ చట్టం ప్రకారం మాదద్రవ్యాలు కలిగి ఉండటం సరఫరా ఉత్పత్తి చట్టరీత్యా నేరం అయినప్పటికీ ఈరోజు మనదేశంలో విచ్చలవిడిగా డ్రగ్స్ దొరుకుతూనే ఉన్నాయి. వాడకం పెరుగుతుంది ఇంతటి ప్రమాదకరమైన సమస్య రోజురోజుకు తీవ్రమవుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి. దీని కోసం తక్షణ పరిష్కారం కోసం ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి.
నిరంతర అప్రమత్తత
డ్రగ్స్ మాదక ద్రవ్యాల దుర్వినియోగం డాగ్స్ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాలు ఒక రోజు కాకుండా నిరంతరం జరగాలి. వీటివల్ల కలిగే ప్రమాదాల గురించి అవగాహన కల్పించాలి. ఈ సమస్య పరిష్కరించడానికి సమర్థవంతమైన పాలన చట్టబద్ధమైన విధానాలను రూపొందించాలి. ప్రభుత్వాలు స్థానిక సంస్థలు మహిళా సంఘాలు పౌర సమాజం స్వచ్చంధ సంస్థలు మాదక ద్రవ్యాలకు సంబంధించిన చట్టాలు కార్యక్రమాలు పట్ల ప్రజలకు అవగాహన కలిగించాలి .డ్రగ్స్ మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక సమాచారాన్ని పంచుకోవాలి మాదక ద్రవ్యాలు సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడానికి ప్రభుత్వాలు రాజ్యాంగ వ్యవస్థలు ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు విద్యావేత్తలు సమిష్టిగా కృషి చేయాలి ఒక్కరోజు మాత్రమే దీని గురించి ఆలోచించి మర్చిపోకూడదు అక్రమ రవాణా ఎదుర్కోవడానికి అంతర్జాతీయంగా దేశాల మధ్యన సహకారం అవసరం. వ్యక్తులు కుటుంబాలు సమాజాలపై మాదకద్రవ్యాల దుర్వినియోగం గురించి అవగాహన చైతన్యం కలిగించాలి. నివారణ చికిత్స పునరావాస కార్యక్రమాలను ప్రోత్సహించాలి. మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాల్లో ప్రజలందరూ సంపూర్ణ భాగస్వాములై డ్రగ్స్ రహిత సమాజం యొక్క ప్రాముఖ్యతను ప్రచారం చేయాలి. వర్క్ షాపులు సదస్సులు చర్చలు ఏర్పాటు చేయాలి. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసే వ్యక్తులను సంస్థలను అవార్డులు ఇచ్చి ప్రోత్సహించాలి. పాఠశాలలు కళాశాలలో డ్రగ్స్ ప్రభావాలు గురించి సదస్సులు నిర్వహించాలి. నైతిక విద్యను పాఠ్యాంశంలో ప్రవేశ పెట్టి డ్రగ్స్ రహిత ఆరోగ్యకరమైన జీవనశైలి పెంపొందించే విద్యాబోధన పాఠ్య ప్రణాళికలు అమలు చేయాలి.
కాశ్మీర్ మాదక ద్రవ్యాల ప్రభావం
కాశ్మీర్ ప్రాంతములో డ్రగ్స్ మాదక ద్రవ్యాల వినియోగానికి యువత బానిసలుగా మారిపోతున్నారు. జమ్ము కాశ్మీర్లో దాదాపు 10 లక్షల జనాభా వుంటే 8 శాతం ప్రజలు గంజాయి ఓపియాయిడ్లు వంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డారు. ఈ సమాచారాన్ని కేంద్ర మంత్రి పార్లమెంట్లో వెల్లడించారు. రిహబిలిటేషన్ కొరకు వచ్చే రోగుల సంఖ్య ఓ 10 ఏళ్లకు ముందు రోజుకు 10 -12 డ్రగ్స్ అడ్డిక్షన్ కేసులు వచ్చేవి ఇప్పుడు 150 – 200 కేసు లు వస్తున్నాయి. ఇది ఆందోళన కలిగించే విషయం అని సైక్రటిస్ట్ డాక్టర్ ప్రొఫెసర్ యాసిర్ రాధార్ ప్రకటించారు. దేశంలో చాలా చోట్ల డ్రగ్స్ మాదక ద్రవ్యాల వ్యపారం విస్తరించి వుంది.
ఐ‘రా’స నివేదిక డ్రగ్స్ అంచనా
ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తం గా 157 దేశాల్లో గంజాయి సాగవుతుంది. దేశంలో అనేక రాష్ట్రాలలో ఈ సమస్య తీవ్రంగా వుంది ఈశాన్య రాష్ట్రాలు అంతర్జాతీయ పోర్టులు ప్రైవేట్ పోర్టులు ద్వారా ఎక్కవ సప్లయ్ అవుతుంది కృష్ణపట్నం పోర్టు శంషాబాద్ ఎయిర్ పోర్టులో డ్రగ్స్ మాదక ద్రవ్యాలు పట్టుబడుతున్నాయి. అభివృద్ధిచెందుతున్న పేద దేశాలలో ఈ వ్యాపారం ఎక్కువగా జరుగుతుంది. ప్రపంచీకరణ కార్పొరేటీకరణ ప్రభావం వల్ల డాగ్స్ వ్యాపారం విస్తరిస్తుంది. 20 30 నాటికి మాదకద్రవ్యాల వ్యాపారం 11% పెరిగిపోతుందని ఐ‘రా’స నివేదిక పేర్కొంది. ఆకలి ‘దారిద్రం’ ‘పేదరికం నిరుద్యోగం’ వైద్యం అందకపోవడం లాంటి అనేక సమస్యలతో సతమవుతున్న ప్రజలను కార్పొరేట్ సంస్థలు మాదక ద్రవ్యాల వ్యాపారంతో దేశాన్ని దోచుకోవడంతో పాటు యువతను నిర్వీర్యం చేస్తున్నారు. మత్తుకు బానిసలైన యువత డ్రగ్స్‌ను పొందడం కోసం అనేక ఘాతకాలకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయి. యువత హింసకు దోపిడీకి పాలుపడుతున్నారు. హింస పెరిగిపోతుంది. కార్పొరేట్ సంస్థల ప్రభుత్వాలు అండగా నిలవడం కరోన మహమ్మారి ప్రపంచాన్ని వనణికించిన సమయంలోను కార్పొరేట్ల దందాను ప్రభుత్వాలు అరికట్టలేకపోయాయి. ఉచిత వాక్సిన్ అందించి ప్రపంచాన్ని కాపాడుకోవాల్సిన ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ప్రవర్తించి కాసులు దండుకునేందుకు దారులు వేసింది.
యువత శక్తి నిర్వీర్యం
డ్రగ్స్ మాదక ద్రవ్యాల వినియోగం యువతను శారీరకంగా మానసికంగా కుంగతీస్తుంది. తీవ్రమైన భావోద్వేగాలకు గురిచేస్తుంది. యువశక్తే దేశ శక్తి అంటున్న ప్రభుత్వాలు యువశక్తి సామర్ధ్యాలను నిర్వీర్యం చేసే బలహీనపరిచే మత్తు పదార్థాల మాదక ద్రవ్యాల వైపు పయనిస్తున్న యువతను కట్టడి చేయలేక పోవడం పాలకుల నిలక్ష్యానికి ప్రతీక డ్రగ్స్ వినియోగం వల్ల దేశాభివృద్ధికి వెన్నెముకగా వుండవలసిన యువత నిర్విర్త్యం అవుతుంది. డ్రగ్స్ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే భౌతిక మానసిక సామాజిక ఆర్థిక నష్టాల గురించి ప్రజల్లో అవగాహన కలిగించాలి. నషా ముక్త్ భారత్ అభియాన్ పథకం ద్వారా 272 జిల్లాలో 13000 మంది వాలంటర్లను పెట్టీ డ్రగ్స్ అరికట్టాలన్న కార్యాచరణ అమలుకు నోచుకోలేదు. డ్రగ్స్ మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడానికి యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం పబ్బులు క్లబ్బులు సినీ పరిశ్రమలో పాఠశాల కళాశాల స్థాయిలో డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని విస్తృత స్థాయిలో నిర్వహించాలి.
డ్రగ్స్ మాదక ద్రవ్యాల వినియోగం అక్రమ రవాణా కేసులను విచారించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి దోషులకు కటిన శిక్షలు అమలు చెయ్యాలి. ఐటి పరిశ్రమలో డ్రగ్స్ మాదక ద్రవ్యాల వినియోగం వ్యాపారాన్ని అరికట్టాలి. డ్రగ్స్ అడిక్ట్‌గా మారిన యువతకు సమగ్ర వైద్య ఆరోగ్య పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలి కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి, డ్రగ్స్ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య సమస్యల మీద అవగాహన కలిగించాలి. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడటానికి వైద్య నివారణ చికిత్స చట్టాల అమలుతో కూడిన ఏకీకృత విధానం అమలు చెయ్యాలి. మాదక ద్రవ్యాల దుర్వినియోగం సమాజం ఉమ్మడి సమస్య డ్రగ్స్ రహిత సమాజ స్థాపన ప్రతి పౌరుని సామాజిక బాధ్యత.
భవిష్యత్తు తరాలకు డ్రగ్స్ మాదక ద్రవ్యాల బారిన పడకుండా సమగ్ర మాదక ద్రవ్యాల వ్యతిరేఖ వ్యూహాన్ని ప్రభుత్వాలు అనుసరించాలి. ప్రతి పౌరుడు ఆరోగ్యకరమైన సురక్షితమైన ప్రపంచం వైపుకు ప్రోత్సహించిన నాడే డ్రగ్స్ మాదక ద్రవ్యాల వినియోగం రవాణా వ్యతిరేక దినానికి సార్థకత. డ్రగ్స్ మాదక ద్రవ్యాల మహమ్మారి నుండి యువతను రక్షించే చర్యలు ప్రభుత్వం చేపట్టాలి. యువతే దేశ భవిత డ్రగ్స్ రహిత సమాజ స్థాపన కోసం దీక్ష బూనాలి. అందరికీ ఆరోగ్యం లక్ష్య సాధనకు సమగ్ర వైద్య ఆరోగ్య సంరక్షణ సంగ్రవ్యాహాలను రూపొందించి డ్రగ్స్ రహిత సమాజ స్థాపన కోసం ప్రభుత్వాలు సమాజం ఉద్యమించాలి.
- నేదునూరి కనకయ్య
తెలంగాణ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు
కరీంనగర్ 9440245771