Sunday, September 29, 2024
Homeఆంధ్రప్రదేశ్Thoguru Arthur: రైతుల సంక్షేమమే ధ్యేయంగా జగనన్న పాలన

Thoguru Arthur: రైతుల సంక్షేమమే ధ్యేయంగా జగనన్న పాలన

సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అర్థర్

గ్రామీణ ప్రాంతాల్లో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఎమ్మెల్యే తోగూర్ అర్థర్ కొనియాడారు. వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆర్థర్ ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని మండల వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్థర్ మాట్లాడుతూ నాలుగేళ్ల వైసీపీ పాలనలో సీఎం జగన్మోహన్ రెడ్డి తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా పరిపాలన సాగిస్తున్న విధానాన్ని రైతులకు వివరించారు. ఆనాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి, రైతుల అభివృద్ధికి పాటుపడడంతో ప్రజల గుండెలో చిరస్థాయిగా చిరస్మనీయుడుగా నిలిచిపోయారని గుర్తు చేశారు. తన తండ్రి ఆశయాలను తూచా తప్పకుండా పరిపాలన కొనసాగిస్తూ ప్రజల మెప్పు పొందుతున్న నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. నేడు రాష్ట్రంలో రైతు సంక్షేమ ప్రభుత్వంగా వైసిపి ప్రభుత్వం వారికి అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు వ్యవసాయ విధానాలపై సలహాలు సూచనలు ఇచ్చేందుకు సిబ్బందిని ఏర్పాటు చేసిన చరిత్ర సీఎం జగన్మోహన్ రెడ్డిది అన్నారు. రైతులకు సబ్సిడీ, పండించిన పంటలకు గిట్టుబాటు ధర, ఎరువులు, నష్టపరిహారాలు, రైతు భరోసా, ఇలా ప్రతి కార్యక్రమంతో రైతులను ఆదుకోవడంలో వైసిపి ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు. నేడు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు రైతు భరోసా కేంద్రాలలో రైతులకు సబ్సిడీలో విత్తనాలను అందజేస్తున్న పరిస్థితిని రైతులకు వివరించి సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రైతులను కోరారు. అనంతరం వ్యవసాయ సహాయ సంచాలకులు విజయ శేఖర్, మండల వ్యవసాయ అధికారి షేక్షావలి రైతు భరోసా కేంద్రాలలో ప్రభుత్వ అందిస్తున్న సబ్సిడీ విత్తనాలపై రైతులకు వివరించారు. ఈ సందర్భంగా రైతును ఉద్దేశించి వారు మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాలలో రైతులు పంటలు వేసుకోవడానికి .. మిని కిట్స్ కందిరకం, ఎల్, ఆర్, జీ 52, కొర్ర రకం ఎస్ ఐ ఏ 3156, అదేవిధంగా గ్రామీణ విత్తనోత్పత్తి పథకంలో భాగంగా
ఐసిపిల్ 87119 ను 75 శాతం రాతితో ఇవ్వడం జరుగుతుందన్నారు. జనరల్ విత్తన పంపిణీలో పథకంలో భాగంగా కందిరకం ఎల్.ఆర్.జి 52, ఐసిపిఎల్ 87119, ఐసిపిహెచ్ 2740, ఈ విత్తనాలను రైతు భరోసా కేంద్రంలో రైతులకు అందుబాటులో ఉంచడం జరిగిందని అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం మండల పరిధిలోని వివిధ రైతులకు సబ్సిడీ విత్తనాలను ఎమ్మెల్యే ఆర్తర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మొల్ల రబ్బాని , కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్, గృహ నిర్మాణ సంస్థ డైరెక్టర్ రమాదేవి, సింగిల్ విండో చైర్మన్ సగినేలా హుస్సేనయ్య, వైఎస్ఆర్సిపి మహిళా అధ్యక్షురాలు డాక్టర్ వనజ,కౌన్సిలర్ ఉండవల్లి ధర్మారెడ్డి, వైఎస్ఆర్ సీపీ నాయకులు పెరుమాళ్ళ జాన్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు వెంకటరమణ,వివిధ గ్రామాల సర్పంచులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News