శ్రీశైల దేవస్థానం పరిపాలన భవనంలో ఆలయ చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో 16వ ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఆలయ చైర్మన్ మాట్లాడుతూ 37 ప్రతిపాదనలను పెట్టగా 27 వాటికి ఆమోదం తెలిపి 6 వాయిదా వేసి 4 తిరస్కరించామన్నారు. భక్తులు 25 వేల టికెట్టుతో ప్రాతకాల సేవలో పాల్గొనేందుకు నిర్ణయించమన్నారు. అలాగే 300 రూపాయల టికెట్ 500 రూపాయల టికెట్ కొన్న భక్తుడికి 100 గ్రాముల లడ్డు ఇవ్వాలని ఆమోదించమన్నారు. ప్రత్యేకంగా ఆలయ భద్రత కోసం జిల్లా ఎస్పీకి లెటర్ పెట్టి డీఎస్పీ క్యాడర్ సిఎస్ఓని నియమించి ఆలయ భద్రతకు మరింత సిబ్బందిని తీసుకొని ఆలయ భద్రత కట్టుదిట్టం చేస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ దేవస్థానం ఉద్యోగులు ఇంటి స్థలాలకు వినతిపత్రం ఇచ్చారని ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లి రూల్స్ ప్రకారం ఇవ్వగలిగితే ఇస్తామన్నారు. ప్రైవేటు నిత్యాన్నదాన సత్రాల పేరుతో స్థలమును పొంది కట్టని వారికి నోటీసులు ఇచ్చి రద్దు చేస్తామన్నారు. ఆలయ భద్రతకు కావలసిన ఏర్పాట్లను సీఎం దృష్టికి తీసుకెళ్లి భద్రతా లోపాలను సరిదిద్దుతామన్నారు. క్షేత్రంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సారథ్యంలో ఆయుర్వేద ఆసుపత్రి ఏర్పాటుకు మాట్లాడం త్వరలోనే అది నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. త్వరలోనే కమిషనర్ మంత్రితో మాట్లాడి ఆలయానికి విజిలెన్స్ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు.