నాలుగేళ్లుగా రాష్ట్రంలో విద్యారంగంపై 66,000 కోట్లు ఖర్చుపెట్టి అందరికీ ఆధునిక-నాణ్యమైన విద్య అందించేలా కృషి చేస్తున్నట్టు సీఎం జగన్ వెల్లడించారు. 10 రోజులపాటు అమ్మ ఒడి పండుగ నిర్వహణలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో జరిగిన ‘జగనన్న అమ్మ ఒడి’ నిధుల విడుదల కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు. పెద్ద ఎత్తున విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మన పిల్లలను గ్లోబల్ సిటిజెన్స్ గా తయారు చేసేందుకు అవసరమైన అన్ని వసతులు కల్పించే ప్రయత్నంలో ఉన్నట్టు జగన్ ఈ సందర్భంగా వివరించారు.
Jagan: మన చిన్నారులు గ్లోబల్ సిటిజెన్స్ కావాలి
నాలుగేళ్లలో విద్యారంగంపై 66,000 కోట్లు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES