Saturday, November 23, 2024
HomeతెలంగాణPuvvada: ప్రభుత్వాసుపత్రుల్లో ఆధునిక చికిత్స

Puvvada: ప్రభుత్వాసుపత్రుల్లో ఆధునిక చికిత్స

ఫాకోతో సర్జరీ తర్వాత కళ్ళజోడు అవసరమే ఉండదు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక సదుపాయాల కల్పన చేస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఫాకో మిషన్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కంటి కాటరాక్ట్ ఆపరేషన్లు అధునాతన పద్దతిలో నిర్వహించేందుకు రూ.28 లక్షలతో ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఫాకో మిషన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అనంతరం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో వైద్య, ఆరోగ్య మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, రూ. 3.46 కోట్లతో రాష్ట్రంలోని 10 జిల్లా ప్రధాన ఆసుపత్రుల్లో ఫాకో మిషన్లు ఏర్పాటు చేసినట్లు, ఇప్పటివరకు కేవలం హైదరాబాద్ లోనే ఉన్న వాటిని జిల్లాలలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఫాకో మిషన్ల ద్వారా కంటి ఆపరేషన్లు చాలా సులువు అవుతాయని, ఇన్ఫెక్షన్, కుట్లు, ఐ ప్యాడ్ లు ఉండవని, ఆధునికంగా, వేగవంతంగా క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయొచ్చని ఆయన అన్నారు. కంటి వెలుగు కార్యక్రమంలో గుర్తించిన క్యాటరాక్ట్ సర్జరీలు వేగంగా పూర్తికి ఈ మిషన్లు ఉపయోగపడతాయన్నారు. ఫాకోతో సర్జరీ తర్వాత కళ్ళజోడు అవసరం ఉండదని, ముందు ఇంజెక్షన్ అవసరం లేదని, దూరపు చూపు కళ్ళద్దాలు అసలే అవసరం ఉండదని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి తెలిపారు.

- Advertisement -

ఈ సందర్భంగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ, ఆధునిక టెక్నాలజీ తో శుక్లాల ఆపరేషన్ సౌకర్యం పేద ప్రజలకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆధునిక యంత్రాల ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులు బలోపేతం అయ్యాయని ఆయన అన్నారు. ఈ యంత్రం ద్వారా ఆపరేషన్లు చేయించుకున్నవారు త్వరగా కోలుకుంటారన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు పనులు పూర్తయినట్లు, ఫర్నీచర్, కావాల్సిన యంత్రాల కొరకు వేచియున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. వెంకటేశ్వర్లు, వైద్యాధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News