Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Rao Inderjit Singh: ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం

Rao Inderjit Singh: ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం

- Advertisement -

Rao Inderjit Singh: ఏపీ పునర్విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తామని పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా తోనే ఏపీ రెవెన్యూ లోటుతో పాటు అభివృద్ధి సాధ్యమని అప్పటి కేంద్రంలోని కాంగ్రెస్, బీజేపీ రెండూ దీనిపై హామీలు ఇచ్చారు. కానీ, అప్పటి నుండి ఆ ఊసేలేదు. ఈ విషయమై ఏపీలో అధికారంలో ఉన్న పార్టీలు పలుమార్లు కేంద్రంతో చర్చలు జరిపినా కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రత్యేక హోదా లేదని తేల్చి చెబుతుంది.

ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా లేదని మరోసారి కేంద్రం తేల్చి చెప్పింది. ఎంపీల ప్రశ్నకు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ ఏపీకి స్పెషల్ స్టేటస్ ముగిసిన అధ్యాయమేనన్నారు. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా సిఫారసు చేయలేదన్న కేంద్ర మంత్రి.. ఏపీ విభజన చట్టంలోని చాలా హామీలను నెరవేర్చామని పేర్కొన్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచినట్ల స్పష్టం చేశారు.

సోమవారంనాడు రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఇంద్రజిత్ సింగ్ ఈ మేరకు స్పష్టత ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ సహా ఇక ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఉండదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా అనే అంశం ఉనికిలో కూడా లేదన్న కేంద్ర మంత్రి ఇంద్రజిత్ సింగ్.. వివిధ కారణాలు, ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా గతంలో ఎన్ డీసీ కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చిందని.. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదని వివరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News