Sunday, October 6, 2024
Homeచిత్ర ప్రభKeeravani : కొనసాగుతున్న RRR అవార్డుల పరంపర.. కీరవాణికి రెండు హాలీవుడ్ అవార్డులు..

Keeravani : కొనసాగుతున్న RRR అవార్డుల పరంపర.. కీరవాణికి రెండు హాలీవుడ్ అవార్డులు..

- Advertisement -

Keeravani : RRR సినిమా తన జైతయాత్రని కొనసాగిస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ సినిమా దేశవ్యాప్తంగానే కాక ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధించి కలెక్షన్స్ రాబట్టింది. మొన్నటిదాకా కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు అవార్డులని రాబడుతుంది.

ఇప్పటికే RRR సినిమాని హాలీవుడ్ లో ఆకాశానికెత్తేస్తున్నారు. సినిమాని, రాజమౌళిని తెగ పొగిడేస్తున్నారు. హాలీవుడ్ లో ఈ సినిమా పలు విభాగాల్లో అవార్డులని గెలుచుకుంటుంది. అక్కడి పేపర్స్ లో కూడా సినిమాపై స్పెషల్ ఆర్టికల్స్ రాస్తున్నారు. తాజాగా మరో రెండు అవార్డులు RRR సినిమాకి వచ్చాయి.

RRR సినిమాకి మ్యూజిక్ విభాగంలో బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కి గాను కీరవాణికి లాస్ ఏంజిల్స్ ఫిలిం క్రిటిక్స్ అవార్డు మరియు బోట్సన్ సోసిటీ అఫ్ ఫిలిం క్రిటిక్స్ అవార్డులు వరించాయి. దీంతో అభిమానులు, పలువురు ప్రముఖులు కీరవాణికి అభినందనలు తెలుపుతున్నారు. ఇక రాజమౌళి ఆస్కార్ ని టార్గెట్ పెట్టుకొని సినిమాని హాలీవుడ్ లో ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News