Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Vijaya Sai Reddy: అర్హులకు సంక్షేమ పథకాలు

Vijaya Sai Reddy: అర్హులకు సంక్షేమ పథకాలు

చిన్న చిన్న కారణాలతో సంక్షేమ పథకాలు అందనివారికి సాయం

ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, కార్యక్రమాలకు అర్హత ఉండి ఏదైనా చిన్న చిన్న కారణాల చేత ఆగిపోయిన వారికి లబ్ధి చేకూర్చాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందని వైఎస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ అనుబంధ విభాగాల ఇంచార్జ్ వి. విజయసాయిరెడ్డి అన్నారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కోఆర్డినేటర్లు, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులతో విజయసాయిరెడ్డి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో పార్టీ క్షేత్రస్థాయి కమిటీల నిర్మాణం, జగనన్న సురక్ష కార్యక్రమాలపై వారికి దిశా నిర్దేశం చేశారు.. ఈ సందర్భంగా జగనన్న సురక్ష కార్యక్రమం గురించి ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందించాలన్న లక్ష్యంతో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించారని చెప్పారు.
జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా జూలై ఒకటి నుండి మండల స్థాయి అధికారులు ఏర్పాటు చేయనున్న శిబిరాల్లో పార్టీ నాయకులు క్రియాశీలకంగా ఉండటం..అలాగే ఈ శిబిరాల్లో పాల్గొనాలని చెప్పారు… అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రతి క్యాంపులో పార్టీకి కీలక నేతలు క్రియాశీలకంగా పాల్గొనేలాగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు చూడాలని సూచించారు.. ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గ పరిధిలోని సచివాలయాల్లో నిర్వహించే శిబిరాల్లో పాల్గొనాలని చెప్పారు.
ప్రజలందరిని ఈ శిబిరాలకు ఆహ్వానించి సురక్ష కార్యక్రమం గురించి అవగాహన కల్పించాలన్నారు. ప్రధానంగా అర్బన్ అసెంబ్లీ నియోజవర్గాల పరిధిలో ఈ కార్యక్రమంపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.. జగనన్న సురక్ష క్యాంపు ప్రారంభానికి ముందు అసెంబ్లీ నియోజకవర్గం స్థాయిలో మీడియా సమావేశాలు ఏర్పాటు చేయాలని, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా విలేఖరుల సమావేశం నిర్వహించాలని వారికి సూచించారు.. ధ్రువీకరించబడిన మూడో జాబితా గృహ సారధులందరూ జగనన్న సురక్ష ప్రచారంలో చురుగ్గా పాల్గొనేలాగా ఎమ్మెల్యేలు కోఆర్డినేట్లు చూడాలన్నారు.. సురక్ష క్యాంపెయినింగ్ సమయంలో పథకాలు లేదా పత్రాలకు సంబంధించి తమకు ఎలాంటి సమస్యలు లేవని పౌరులు పేర్కొంటే సీఎంతో వారు ప్రశంసలు పంచుకోవడానికి “థాంక్యూ జగనన్న” అని టైప్ చేసి 9052690526 నంబర్ కు ఎస్.ఎం.ఎస్ పంపించేలా చూడలన్నారు..

- Advertisement -

పార్డీ కమిటీల ప్రతిపాదనలను జూలై -3 లోపు పంపించండి

అనుబంధ విభాగాల పటిష్టతతోనే పార్టీ బలోపేతం చేసుకోగలమని విజయసాయి రెడ్డి అన్నారు… వైఎస్ఆర్ సిపీ అనుబంధ విభాగ కమిటీల ప్రతిపాదనలలను జూలై మూడు లోపు తప్పనిసరిగా పార్టీ కేంద్ర కార్యాలయానికి సమర్పించాలని ఆయన ఈ టెలికాన్ఫరెన్స్ లో విజ్ఞప్తి చేశారు..ఇప్పటికే 18 జిల్లాల నుంచి కమిటీల జాబితాలను కేంద్ర కార్యాలయానికి సమర్పించారని మిగిలిన 8 జిల్లాల కమిటీల జాబితాలను సమర్పించాలని ఆయన కోరారు. అలాగే పార్టీ(నగర కార్పొరేషన్) కమిటీలకు సంబంధించిన ప్రతిపాదలను కూడా త్వరగా పంపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News