సంక్షేమ పథకాలు ప్రజా సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా అర్హత ఉండి పొరపాటు ఎక్కడైనా మిగిలిపోయిన అర్హులను కూడా తలుపుతట్టి మరీ మంచి చేసే కార్యక్రమమే జగనన్న సురక్ష అని ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి తెలిపారు. పట్టణంలోని ఎమ్మెల్యే గంగుల నాని కార్యాలయంలో ఎంపీపీ గజ్జల రాఘవేంద్ర రెడ్డి నియోజకవర్గ పరశీలకులు నరసింహారెడ్డి, కౌన్సిలర్ గోట్లూరు సుధాకర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోపవరం నరసింహారెడ్డి, గంగుల రామిరెడ్డి గూబగుండం వెంకటసుబ్బారెడ్డి బత్తుల కృష్ణయ్య యాదవ్ లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదలకు పేద లబ్ధిదారులకు ప్రభుత్వమే ప్రభుత్వ సేవలు ప్రభుత్వ పథకాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ ఉద్యోగులు వాలంటీర్లు ప్రజాప్రతినిధులు గృహసారధులందరూ నేరుగా లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళడమే జగన్న సురక్ష కార్యక్రమం అన్నారు. గ్రామం వార్డు సచివాలయాల పరిధిలో నిర్వహించే కార్యక్రమాన్ని జులై 1 శనివారం నుండి ప్రారంభిస్తున్నామన్నారు. అర్హులైన ఉండి ఏ ఒక్కరు కూడా నాకు ఈ సేవలు అర్హత ఉండి అందలేదని అని అంటే అలాంటి వారిని జల్లెడ పట్టి వారికి కావలసిన డాక్యుమెంటేషన్ కోసం చేయి పట్టుకొని నడిపిస్తూ వారికి మంచి చేసే కార్యక్రమమే ఇది అన్నారు. వివిధ రకాల సర్టిఫికెట్లు జగనన్న సురక్ష కార్యక్రమంలో జారీ చేస్తారు అన్నారు. ఆదాయము, కులము ,పుట్టినరోజు, కొత్త రేషన్ కార్డు, సిసిఆర్సి కార్డులు ఆధార్కు లింకుల్ని బ్యాంకు లింక్ చేసి ఆధార్ కార్డులో మార్పులు ఇవన్నీ కూడా ఈ కార్యక్రమం కింద చేపడతామన్నారు .వీటన్నిటికీ ఎలాంటి సర్విస్ ఛార్జింగ్ లేకుండానే 11 రకాల సేవలను ఉచితంగా అందిస్తున్నట్లు ఎమ్మెల్యే గంగుల తెలిపారు.
Gangula: ‘జగనన్న సురక్ష’ శ్రీరామరక్ష ఎమ్మెల్యే గంగుల
అర్హత ఉండి ప్రభుత్వ పథకాలు దక్కనివారి ఇంటి తలుపులు తట్టేదే ఈ ప్రోగ్రాం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES