పళ్లు తినడం ఇష్టం ఉండనిది ఎవరికి? పైగా ఆరోగ్యానికి పళ్లు తినడం ఎంతో మంచిది. ముఖ్యంగా శరీర బరువును పళ్లు తగ్గిస్తాయి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. పళ్ల ద్వారా ఎన్నో ఖనిజాలు, విటమిన్లు, నీరు శరీరానికి అందుతాయి. అయితే పళ్లు తినేటప్పుడు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. చాలామందికి పళ్లు తినే పద్ధతి తెలియదు. పళ్లు తినేటప్పుడు చేసే పొరబాట్ల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాతినడం వల్ల ఆరోగ్యానికి హానికరంగా పరిణమించే అవకాశం కూడా ఉందంటున్నారు
పోషకాహారనిపుణులు. ముఖ్యంగా పళ్లను ఇతర ఫుడ్ ఐటమ్స్ తో , రకరకాల కాంబినేషన్స్ తో చాలామంది తింటుంటారు. ఇది మంచి అలవాటు కాదు. దీనివల్ల జబ్బుల బారిన పడే అవకాశం ఉంది. పళ్లతోపాటు ఇతర పదార్థాలు తినడం వల్ల జీర్ణక్రియ సరిగా జరగదు. మనం తినే బరువైన ఆహారం అరిగేవరకూ కడుపులోనే పళ్లు ఉండిపోతాయి. వీటిల్లోని పోషకాలను గ్రహించడానికి శరీరానికి కష్టమవుతుంది. అంతేకాదు జీర్ణక్రియ జరిగే క్రమంలో ఊరే రసాల్లో ఈ పళ్ల రసాలు ఇంకి పులుస్తాయి.
ఇది విషతుల్యం. దీనివల్ల శరీర ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. అనారోగ్యం పాలబడతారు. అందుకే పళ్లను విడిగా మాత్రమే తినాలి. నిద్రపోవడానికి రెండు మూడు గంటల ముందు ఎలాంటి ఆహార పదార్థాలు తినకూడదు. అలా తింటే జీర్ణక్రియ కష్టమవుతుంది. పళ్లను కూడా నిద్రపోవడానికి ముందు తినకూడదు. నిద్రపోయేముందు వీటిని తింటే నిద్రపట్టదు. ఆ టైములో పళ్లు తినడం వల్ల
శరీరంలో చక్కెర ప్రమాణాలు పెరిగి విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో శరీరంలో ఎనర్జీ ప్రమాణాలు పెరుగుతాయి. అంతేకాదు రాత్రి వేళల్లో పోషకాల అరుగుదల కష్టంగా ఉంటుంది. ఎసిడిటీ సమస్య తలెత్తుతుంది కూడా. అందుకే పళ్లను ఈవినింగ్ స్నాక్ గా తీసుకోవడం ఉత్తమం. పళ్లను తినడానికి అదే సరైన సమయం కూడా. చిన్నా పెద్దా చాలామందిలో చూసే మరో అలవాటు ఏమిటంటే పళ్లు
తిన్న వెంటనే నీళ్లు తాగుతుంటారు. అలా చేయడం వల్ల జర్ణవ్యవస్థ పిహెచ్ ప్రమాణాలు అసమతుల్యతకు గురవుతాయి. ముఖ్యంగా నీరు ఎక్కువగా ఉండే పుచ్చకాయలు, కీరకాయలు, కమలాలు, స్ట్రాబెర్రీ, తీపిదోసకాయలు రాత్రి సమయాల్లో అస్సలే తినకూడదు. అలా తింటే కలరా, డయేరియా లాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెప్తున్నారు. పళ్లు తినేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్య విషయం ఏమిటంటే పళ్లను తొక్కతో తినాలి. పళ్ల తొక్కల్లో ఫైబర్,
విటమిన్లు బాగా ఉంటాయి. ఉదాహరణకు యాపిల్ పండు తొక్కలో ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సిలు బాగా ఉంటాయి. తొక్కతోపాటు పళ్లను తినడం వల్ల కాన్సర్, ఊబకాయం వంటి సమస్యలు రావని అధ్యయనాలు కూడా చెప్తున్నాయి.