Tuesday, October 22, 2024
Homeహెల్త్Glowing skin: నునుపైన చర్మానికి సీక్రెట్ ఫార్ములా

Glowing skin: నునుపైన చర్మానికి సీక్రెట్ ఫార్ములా

శీతాకాలంలో గాలిలో కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. గాలిలో తేమ తగ్గి చర్మం పొడారిపోతుంది. అందుకే ఈ సీజన్ లో హెలురోనిక్ యాసిడ్ ఉన్న మాయిశ్చరైజర్లు, సిరమ్, బాడీవాష్ లు వాడితే చర్మం బాగా నునుపుదేలడమే కాదు ఎంతో కాంతివంతంగా కూడా ఉంటుంది. హెలూరోనిక్ యాసిడ్ ఉండే చర్మ ఉత్పత్తులు మార్కెట్లో చాలా ఉన్నాయి. చర్మానికి కావలసిన తేమను అందించడం ఈ యాసిడ్ ప్రత్యేకత. దీన్ని చర్మంపై రాసుకోవడం వల్ల చర్మంలో ఉండే

- Advertisement -

వాటర్ మాలిక్యూల్స్ పోవు. దాంతోపాటు ఇవి చర్మంలో తేమను పెంచడమే కాకుండా తేమ స్వభావం పోకుండా కూడా కాపాడతాయి. పైగా చర్మాన్ని పొడారిపోకుండా ఉంచుతుంది. ముఖ్యంగా స్నానం చేసిన తర్వాత హెలురోనిక్ యాసిడ్ ని వాడితే చలికాలంలో మీ చర్మం బాగా నునుపు దేలుతుంది. అలాగే చర్మం మెరుస్తుండాలంటే విటమిన్ సి చర్మానికి అందేలా చూసుకోవాలి. ముఖ్యంగా చలికాలంలో రక్తప్రసరణ బాగా జరిగేలా , శరీర ఉష్ణోగ్రత సరిగా ఉండేలా చూసుకోవాలి. అలా ఉంటే చల్లటి వాతావరణం మీ చర్మంపై ఎలాంటి దుష్ప్రభావం చూపదు. అందుకు విటమిన్ సి వినియోగం శరీరానికి చాలా అవసరం. చర్మ సమస్యలు తలెత్తకుండా కూడా విటమిన్ సి కాపాడుతుంది. చర్మం కాంతివిహీనంగా, అలసిపోయినట్టుగా కనిపించనియకుండా సంరక్షిస్తుంది. విటమిన్ సి శరీరంలో కొలాజిన్ ని బాగా ఉత్పత్తి చేస్తుంది.

ఇది చర్మం యొక్క ఎలాస్టిసిటీని సంరక్షించడమే కాదు చర్మం బిగువును కోల్పోనివ్వదు. అందుకే ఈ సీజన్లో విటమిన్ సి, ఫెరులిక్ యాసిడ్ ఉండే స్కిన్ కేర్ ప్రాడెక్టును చర్మంపై పూసుకోవాలి. సెరామైడ్స్ చర్మం పనితీరును బాగా మెరుగుపరుస్తాయి. గాలిలోని కాలుష్యం, విషతుల్యమైన పదార్థాలు, చల్లటి ఉష్ణోగ్రతల బారిన చర్మం పడకుండా కాపాడతాయి. చర్మంలో తేమ గుణాన్ని పోనివ్వవు. అంతేకాదు చర్మం పొడారిపోకుండా సంరక్షిస్తాయి. ఈ సీజన్లో రోజుకు రెండుసార్లు సెరామైడ్స్ ఉపయోగించడం

వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. చర్మరక్షణకు ఉపయోగించే మాయిశ్చరైజర్లు, సెరమ్స్, బాడీ వాష్, స్క్రబ్స్ లో సైతం సెరామైడ్స్ ఉంటాయి. ముఖానికి ఫేస్ సిరమ్ రాసుకున్న తర్వాత సెరామైడ్ ఉన్న మాయిశ్చరైజర్ ని వాడితే చర్మంలో తేమగుణం పోదు. పైగా కావలసినంత హైడ్రేషన్ ని ఇది చర్మానికి అందిస్తుంది. చలికాలంలో చర్మరక్షణకు ఉపయోగపడే మరోకటి ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ (ఎహెచ్ఎ). ఇది మాయిశ్చరైజింగ్ ఏజెంటు కాదు కాని ఇందులో చర్మాన్ని ఎక్స్ ఫొయిలేట్ చేసే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది కెమికల్ ఎక్స్ ఫోయిలేటర్. చర్మంపై ఉండే మ్రుతకణాలను పోగొడుతుంది. స్కిన్ టోన్

ను కాపాడుతుంది. అయితే దీన్ని చర్మంపై అతిగా ఉపయోగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే చర్మం రాలిపోవడం, దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కెమికల్ ఎక్స్ ఫోయిలేషన్ కొత్తగా మొదలెట్టిన వాళ్లు లాక్టిక్ లేదా గ్లైకోలిక్ యాసిడ్ ఎక్స్ ఫోయిలేటింగ్ సిరమ్, బాడీ క్రీము వారానికి ఒకటి లేదా రెండుసార్లు అప్లై చేసుకోవడం మంచిది. వీటిని వాడే ముందు చర్మ నిపుణుల సలహాను తప్పనిసరిగా తీసుకోవాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News