పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈనెల 20 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే ఈ మాన్సూన్ సెషన్స్ ఎంతో స్పెషల్ సెషన్ గా చరిత్ర సృష్టించబోతోంది. ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో తొలిసారి పార్లమెంట్ కొత్త భవనం నిర్మించగా ఆ కొత్త భవనంలో పార్లమెంట్ సమావేశాలు తొలిసారి ఇక్కడ జరగనున్నాయి. అయితే పాత పార్లమెంట్ భవనంలో సమావేశాలు ప్రారంభమై కొత్త పార్లమెంట్ భవనంలో ముగియనుండటం మరో ప్రత్యేకత.
- Advertisement -
జూలై 20 నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు వర్షాకాల సమావేశాలు జరుపనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాలశాఖా మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు.