రాష్ట్రవ్యాప్తంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభం చేస్తున్న సందర్భంగా ఎంపీడీఓ వాసుదేవగుప్తా అధ్వర్యంలో శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి బండిఆత్మకూరు మండలం ఏ .కోడూరు గ్రామంలో ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడ జరగని విధంగా ప్రతీ ఇంటికీ వెళ్ళి సమస్యలను తెలుసుకొని, పరిష్కారం చూపించే దిశగా చేస్తున్న మరో విన్నూత కార్యక్రమమే జగనన్న సురక్ష అన్నారు.
నేటి నుండి నాలుగు వారాల పాటు సచివాలయల వద్ద ప్రత్యేక క్యాంపులు నిర్వహించి అన్ని రకాల వినతుల పరిష్కారానికి చర్యలు తీసుకునేలా, 11 రకాల సేవల్ని జగనన్న ప్రభుత్వము అందిస్తోందని అలానే ప్రజలకి సామాజిక భద్రత కల్పిస్తోందని అర్హులై ఎవరైనా ఉంటే గుర్తించి గౌరవప్రదమైన సేవలు ఇవ్వడమే ఈ జగనన్న సురక్ష కార్యక్రమ లక్ష్యం అని ఎమ్మెల్యే శిల్పా తెలిపారు. ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు సమస్యలు ఉంటే తెలుసుకుని వేగంగా పరిష్కరించే దిశగా వాలంటీర్లు, కన్వీనర్లు ,గృహ సారథులను సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో ఉండి పనిచేస్తున్న అధికారులు, నాయకులు మరింత వేగంతో పని చేయాలని ఎమ్మెల్యే శిల్పా తెలిపారు. మండలంలో ఎక్కడైనా ఎవరైనా ఎప్పుడైనా జగనన్న సురక్షలో తమకు న్యాయం జరిగిందని చెప్పాలని అధికారులకు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ శిల్పా భువనేశ్వర రెడ్డి, ఎంపీపీ దేరెడ్డి సంజీవ రెడ్డి, మండల కన్వీనర్ బా రెడ్డి శ్రీనివాస రెడ్డి,మండల జేసీఎస్ కన్వీనర్ ముడిమెల పుల్లారెడ్డి, మాజీ ఎంపీపీ వెంకటరామిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ భూరం శివలింగం,మార్కెట్ యార్డ్ డైరెక్టర్ విక్రమ్ సింహ నాయక్, సర్పంచ్ మన్నే జ్ఞానభరణం కుమార్, మండల అధికారులు, సచివాలయం ఉద్యోగులు, గృహ సారధులు, కన్వీనర్లు, వాలంటీర్లు వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Shilpa: పేదోళ్ళ సమస్యల పరిష్కారమే ‘జగనన్న సురక్ష’
11 రకాల సేవలు జగనన్న సురక్ష కింద
సంబంధిత వార్తలు | RELATED ARTICLES