ఖమ్మంలో రేపటి తెలంగాణ జనగర్జన సభను విజయవంతం చేయాలని సత్తుపల్లి పట్టణంలో ఉన్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్ క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు సీతక్క. మా ఓట్లుతో గెలిచి మా మీద హత్యా, నీచ రాజకీయాలు చేయడం కేవలం బీఆర్ఎస్ పార్టీకే సాధ్యం అయిందని సీతక్క తన స్టైల్లో మండిపడ్డారు. మా పార్టీ లేకపోతే అజయ్ కుమార్ కి రాజకీయ పుట్టక లేదని, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు జీవితం లేదని సీతక్క ఫైర్ అయ్యారు. మీటింగ్ కు ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీ బస్సులు పెట్టనీయకుండా నీచమైన రాజకీయలు చేయడం మంత్రి అజయ్ కుమార్ సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ లేకపోతే నువ్వు మంత్రి అయ్యేవాడివా, కాంగ్రెస్ ఓట్లు లేకపోతే సండ్ర వెంకట వీరయ్య ఎమ్మెల్యే గెలిచేవాడా అంటూ ఆమె నిలదీశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాహుల్ గాంధీ సభకు ప్రజలంతా తరలిరావాలని పిలుపునిచ్చారు సీతక్క.
ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ సెంటర్ కౌన్సిల్ సెక్రటరీ రావి నాగేశ్వరావు, గాదిరెడ్డి సుబ్బారెడ్డి, రామిశెట్టి సుబ్బారావు, కృష్ణ, ఎండి ఫజల్ రెహమాన్ బాబా, కంభంపాటి కాంతారావు, జే వి ఆర్ ఓ సి ఐ ఎన్ టి యు సి అధ్యక్షులు నేలపాల రామారావు, మందలపు శ్రీనివాసరెడ్డి, దామాల్ రాజు, పాశం నాగేశ్వరావు, కర్నాటి వెంకటరెడ్డి, గండ్ర జగన్మోహన్ రెడ్డి, పసల ఏడుకొండలు, మోరు బోయిన ప్రసాద్ యాదవ్, కొమ్మేపల్లి బాజీ, కొమ్మేపల్లి ఖలీల్, వెల్లంపల్లి ఏడుకొండలు, రాగం సత్యనారాయణ,బలుసు పాటి వెంకటేశ్వర్లు, ఉమామహేశ్వర చారి, గుర్రాల దేవ ప్రియుడు, ప్రకాష్, అర్పత్ పాషా, పోతుల భరత్ గౌడ్, చవాన్ కోటేశ్వరరావు పాల్గొన్నారు.