Friday, November 22, 2024
Homeనేషనల్Udhayanidhi Stalin: మంత్రి కాబోతున్న ఉదయనిధి.. స్టాలిన్ తర్వాత వారసుడు దొరికినట్లే!

Udhayanidhi Stalin: మంత్రి కాబోతున్న ఉదయనిధి.. స్టాలిన్ తర్వాత వారసుడు దొరికినట్లే!

- Advertisement -

Udhayanidhi Stalin: డీఎంకేలో మూడో తరం వారసుడు ఉదయనిధి స్టాలిన్ కి త్వరలో అమాత్యయోగం కలగబోతోందా అంటే అవుననే అంటున్నాయి తమిళనాడు రాజకీయ వర్గాలు. గత ఎన్నికల్లో ఎమ్యెల్యేగా ఎన్నికైన ఆయన.. తన తండ్రి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ క్యా బినెట్లో మంత్రి అవుతాడన్న ప్రచారం జోరందుకుంది. తమిళనాడులో బుధవారం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగనుంది. ఈ మంత్రివర్గ విస్తరణలో స్టాలిన్ కి మంత్రి పదవి దక్కడం ఖాయంగా కనిపిస్తుంది.

ఉదయనిధి స్టాలిన్ ప్రస్తుతం డీఎంకే యువజన విభాగం కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఇక తనకు మంత్రి పదవి లభిస్తుందనే వార్తలపై ఉదయనిధి స్టాలిన్ స్పందించారు.
ఈ వార్తలను ఆయన ధ్రువీకరించలేదు.. అదే సమయంలో ఖండించనూలేదు. ఈ విషయంలో ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని, దానిపై తాను వ్యాఖ్యానించలేనని మాత్రం చెప్పారు. అయితే, క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ సమయంలో ఉదయనిధి స్టాలిన్ కి కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని డీఎంకేలోని ప్రముఖ వర్గాలు పేర్కొంటున్నా యి.

బుధవారం జరగనున్న సీఎం స్టాలిన్ క్యా బినెట్ పునర్వ్య వస్థీకరణలో ఉదయనిధికి క్రీడలు, యువజన సంక్షేమ శాఖ లేదా గ్రామీణాభివృద్ధి, ప్రత్యేక కార్యక్రమాల శాఖను అప్పగించబోతున్నట్లు వినిపిస్తుంది. ఉదయనిధి మంత్రి కాబోతుండడంతో ప్రతిపక్షాలు సహజంగానే విమర్శలు మొదలు పెట్టాయి. డీఎంకే కుటుంబ పార్టీగా ఎప్పుడో మారిపోయిందంటూ ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి తీవ్ర విమర్శలు చేశారు.

అయితే, ప్రతిపక్షాల విమర్శలు ఎలా ఉన్నా ఉదయనిధి మంత్రిగా అయితే అటు డీఎంకేకి.. ఇటు తమిళనాడు రాష్ట్రానికి మరో వారసుడు, భవిష్యత్ ముఖ్యమంత్రి అభ్యర్థి దొరికినట్లేనని అధికారికంగా ప్రకటించినట్లే. ఎందుకంటే కరుణానిధి తరువాత వారసులు ఎంతమంది ఉన్నా స్టాలిన్ రాజకీయ వారసుడిగా ఎదిగిన సంగతి తెలిసిందే. ఇక, ఇప్పుడు కరుణానిధి మూడవ తరంలో పెద్దగా కష్టమేమీ లేకుండానే ఉదయనిధి భవిష్యత్ పార్టీ పగ్గాలు చేపట్టే నేతగా ఎదుగుతున్నారు. మిగతా కరుణానిధి వారసులతో పోల్చితే ఉదయనిధికి సినీ గ్లామర్ కూడా తోడుండడం.. గత ఎన్నికలలో పార్టీ కోసం తెలివిగా పనిచేసాడన్న పేరుండడం ఉదయనిధిని తిరుగులేని వారసుడిగా నిలబెడుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News