Thursday, November 21, 2024
Homeఇంటర్నేషనల్Inland taipan: ప్రపంచంలోనే విషపూరితమైన పాము.. ఒక్క కాటు వేస్తే 100 మంది మృతి!

Inland taipan: ప్రపంచంలోనే విషపూరితమైన పాము.. ఒక్క కాటు వేస్తే 100 మంది మృతి!

- Advertisement -

Inland taipan: ఈ ప్ర‌పంచంలో ఎన్నో రకాల సర్పాలున్నప్పటికీ అన్నీ విషపూరితం కాదు. అందులో విషపూరితమైన వాటిలో కూడా అన్నీ ప్రాణాంతకం కాదు. సుమారు 600 రకాల విష‌పూరిత పాములు ఉన్న‌ప్ప‌టికీ, కేవ‌లం 200 పాములు మాత్ర‌మే అత్యంత విష‌పూరిత‌మైన‌వి అని తేలింది. ఈ 200 పాములు కాటేస్తే మ‌న‌షుల ప్రాణాల‌కే ముప్పు. మన ఇండియాలో అయితే విష సర్పాలు అంటే నాగుపాము, రక్తపింజరి, కట్లపాము, కింగ్ కోబ్రాల పేర్లు చెబుతారు. ఇతర దేశాలలో అంతకు మించిన ప్రాణాంతకమైన పాములు ఉన్నాయట.

విషపూరితమైన 200 పాములలో యమా యమా డేంజర్ పాము ఇన్‌ల్యాండ్ తైపాన్. ఈ పాము ప్ర‌పంచంలోనే అత్యంత విష‌పూరిత‌మైన‌దట. ఆస్ట్రేలియాలో క‌నిపించే ఈ పాముకు ఇన్‌ల్యాండ్ తైపాన్ అని పేరు. దీన్ని ఫియ‌ర్స్ స్నేక్ అని కూడా పిలుస్తారు. ప్ర‌పంచంలోనే అత్యంత విష‌పూరిత‌మైన పాము ఇది. దీని త‌ల దీర్ఘ‌చ‌తుర‌స్రాకారంలో ఉంటుంది. ఇక ఉద‌యం వేళ తైపాన్ చాలా యాక్టివ్‌గా ఉంటూ రోజు గడిచేకొద్దీ యాక్టివ్ తగ్గుతుందట.

ఒక వేళ ఈ పాము ఒక్క‌సారి కాటేస్తే 100 మంది ప్రాణాలు కోల్పోయే విషాన్ని విడుదల చేయగలదని, ఒక్కకాటు విషంతో 2.50 లక్షల ఎలుకలను చంపవచ్చని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ కు చెందిన పరిశోధకులు చెబుతున్నారు. ఈ ప్రమాదకర పాములు ఆస్ట్రేలియాలో తప్ప మరెక్కడా కనిపించవని.. అది కూడా మారుమూల అటవీప్రాంతాల్లోనే సంచరిస్తుంటాయని.. ఈ పాము సగటున 1.8 మీటర్ల పొడవు పెరుగుతుండగా.. వీటి కోరలు 3.5 నుంచి 6.2 మిమీ పొడవు ఉంటాయి. వీటికి ఋతువులను అనుసరించి చర్మం రంగును మార్చుకునే గుణం కూడా ఉంటుందట.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News