పుట్టుమచ్చలను పోగొట్టే ఆముదం నూనె…
కొంతమందికి శరీరంపై ఎక్కువ పుట్టుమచ్చలు ఉండి ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అయితే వీటిని తొలగించుకునే సులువైన ఇంటి చిట్కాలు ఉన్నాయి. ఆముదంనూనె, బేకింగ్ సోడాలను కలిపి పుట్టుమచ్చలపై రాస్తే పోతాయి. అలాగే ఆముదం, వెల్లుల్లి పేస్టు మిశ్రమం కూడా పుట్టుమచ్చలను పోగొడతాయి. తేనె, ఆముదం కూడా పుట్టుమచ్చలను పోగొట్టే మరో నేచురల్ ఇంటి చిట్కా. అలాగే టీ ట్రీ ఆయిల్, ఆముదంనూనె రెండింటినీ కలిపి పుట్టుమచ్చలపై రాస్తే అవి పోతాయి. అయితే వీటిని శరీరం మీద అప్లై చేసేముందు వైద్యుని సంప్రదించాలని మరవొద్దు. నేచురల్ రెమిడీలైనా కూడా కొందరి చర్మం సున్నితంగా ఉండి ఎలర్జీలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి చర్మ నిపుణులను సంప్రదించి ఈ చిట్కాలను అనుసరిస్తే మంచిది. రెండు లేదా మూడు చుక్కల ఆముదం నూనెలో అర టీస్పూన్ బేకింగ్ సోడా వేసి చిక్కటి పేస్టులా చేయాలి. దాన్ని పుట్టుమచ్చపై రాసి బ్యాండేజితో కవర్ చేయాలి. మర్నాడు ఉదయం మాత్రమే ఆ బ్యాండేజిని తీయాలి.
వెల్లుల్లి, ఆముదం నూనె మిశ్రమం కూడా చర్మంపై ఏర్పడిన పుట్టుమచ్చలను తొలగిస్తుంది. రెండు లేదా మూడు చుక్కల ఆముదం నూనెలో అర టీస్పూన్ తాజా వెల్లుల్లి పేస్టు లేదా వెల్లుల్లి పొడి వేసి కలిపి దాన్ని పుట్టుమచ్చలపై అప్లై చేసి కొన్ని గంటల పాటు అలాగే ఉంచాలి. తర్వాత నీటితో ఆ భాగంలో కడిగేసి తువ్వాలుతో తడి లేకుండా తుడుచుకోవాలి. వేగంగా ఫలితం కనిపించాలంటే రోజుకు రెండుసార్లు దీన్ని పుట్టుమచ్చలపై రాసుకోవాలి. ఈ కిటుకు వల్ల వారం రోజుల్లో మీకు మంచి ఫలితం కనిపిస్తుంది. వెల్లుల్లి పేస్టు, పొడి బదులు వెల్లుల్లి ఆయిల్ ని కూడా ఇందులో వాడొచ్చు. పుట్టుమచ్చలను పోగొట్టే మరో వంటింటి కిటుకు ఉంది. ఆముదం నూనె, తేనె మిశ్రమాన్ని పుట్టుమచ్చలపై రాసుకోవాలి. ఒక టీస్పూను తేనె, రెండు మూడు చుక్కల ఆముదం, అర టీస్పూను అవిశె గింజల పొడి (ఛాయిస్) కలిపి పేస్టులా చేసి పుట్టుమచ్చ ఉన్న చోట రాయాలి. దానిపై బ్యాండ్ ఎయిడ్ వేసి కొన్ని గంటలు అలాగే ఉంచుకోవాలి. తర్వాత ఆప్రదేశాన్ని బాగా కడుక్కొని తిరిగి ఈ మిశ్రమాన్ని పుట్టుమచ్చలపై అప్లై చేసుకోవచ్చు. ఈ కిటుకును రోజుకు రెండు సార్లు రెండు రోజుల పాటు కొనసాగించాలి. ఇలా చేస్తే వారం పది రోజుల్లో మంచి ఫలితం కనిపిస్తుంది. ఇందులో అవిశెగింజల పొడి బదులు అవిశె గింజల నూనె కూడా వాడొచ్చు. అలాగే టీ ట్రీ ఆయిల్, ఆముదం నూనె మిశ్రమం కూడా పుట్టుమచ్చలను పోగొట్టడంలో ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది.
మూడు లేదా నాలుగు చుక్కల టీ ట్రీ ఆయిల్, ఒక టీస్పూను ఆముదం నూనె, కాటన్ బాల్, టేప్ రెడీ పెట్టుకోవాలి. ఆముదంనూనెలో టీట్రీ ఆయిల్ కలపాలి. అందులో కాటన్ బాల్ ను ముంచి కాసేపు నానబెట్టాలి. ఆతర్వాత దాన్ని పుట్టుమచ్చపై పెట్టి అది పడిపోకుండా టేప్ వేయాలి. మూడు లేదా నాలుగు గంటల పాటు దాన్ని అలాగే ఉంచాలి. ఇలా రోజుకు ఒకసారి లేదా రెండుసార్లు చేయాలి. ఇలా చేస్తే వారం నుంచి నెలరోజుల్లో పుట్టుమచ్చలు పోతాయి. టీ ట్రీ ఆయిల్ వల్ల కొందరికి దద్దుర్లు, స్కిన్ ఇరిటేషన్ తలెత్తుతుంది కాబట్టి దీన్ని ఉపయోగించే ముందు చర్మంపై తప్పనిసరిగా ప్యాచ్ టెస్టు చేసుకోవాలి.