Saturday, October 5, 2024
HomeతెలంగాణManakonduru: ఘనంగా పెద్దమ్మ బోనాలు, పట్నాలు వేడుకలు

Manakonduru: ఘనంగా పెద్దమ్మ బోనాలు, పట్నాలు వేడుకలు

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని అలుగునూర్ (8వ డివిజన్) లో పెద్దమ్మ బోనాలు, పట్నాల వేడుకల్లో భాగంగా ఆదివారం ఆలయంలో ప్రత్యేక పూజలు, పెద్దపట్నం నిర్వహించి, అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకల్లో స్థానిక కార్పొరేటర్ సల్ల శారద- రవీందర్, డిసిసి ఇంచార్జ్ డాక్టర్ కవ్వంపల్లి సత్య నారాయణ, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు సిల్ల రాములు, సభ్యులు మనోహర్, రాజమల్లు, సిల్ల కుమార్, తునికి స్వామి, యూత్ సభ్యులు సిల్ల గంగాధర్, వినోద్, జంగపల్లి రమేశ్, కాంగ్రెస్ డివిజన్ ప్రెసిడెంట్ రమేష్, నాయకులు గోపు మల్లారెడ్డి, గూడ కనకయ్య, కంది శ్యామ్ సుందర్ రెడ్డిలతో పాటు ప్రజాప్రతినిధులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News