Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Gangula: అన్ని చోట్లా పోటీ చేయలేని పవన్ జగన్ ఓడిస్తాడా?

Gangula: అన్ని చోట్లా పోటీ చేయలేని పవన్ జగన్ ఓడిస్తాడా?

175 స్థానాలకు పవన్ పార్టీ పోటీ చేయాలని సవాల్

రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే సత్తా లేని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా ఓడిస్తారని మాజీ ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఆళ్లగడ్డ శాసనసభ్యులు గంగుల బిజేంద్ర రెడ్డిలు సూటిగా ప్రశ్నించారు. చాగలమర్రిలో మండల కో ఆప్షన్ సభ్యుడు జిగ్గి ఇబ్రహీం ఇంట్లో జరిగిన ఒక శుభ కార్యక్రమానికి వారు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భముగా వారు విలేకరులతో మాట్లాడుతూ పొత్తుల కోసం ప్రాకులాడకుండా దమ్ము-ధైర్యం ఉంటే 175 అసెంబ్లీ స్థానాలకు పవన్ పార్టీ పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఉభయ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఎమ్మెల్యే సీటు రాకుండా చూస్తానని అయన ఉత్తర కుమారుని ప్రగల్బాలు పలుకుతున్నారని దుయ్యబట్టారు. పవన్ కు రాజకీయ అనుభవం లేకపోవడంతో ఒక్కోచోట ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారని వారు ధ్వజమెత్తారు. ఆయన మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాబులాల్ ఆ పార్టీ మండల కన్వీనర్ కుమార్ రెడ్డి చాగలమర్రి ఉప సర్పంచ్ షేక్ సోహైల్ మండల ఉపాధ్యక్షుడు ముల్లా రఫీ మండల కో ఆప్షన్ సభ్యుడు జిగ్గి గారి ఇబ్రహీం గొడుగునూరు ఎంపిటిసి పత్తి నారాయణ సేవ దళ్ అధ్యక్షుడు గణేష్ రెడ్డి వైసీపీ నాయకులు భారత్ గ్యాస్ రఫీ గేట్ల మహబూబ్, ముల్లా ఖాదర్బాషా చక్రం ముల్లా షబ్బీర్ , వెంకటరమణ షేక్ షబ్బీర్, దాదా బీడీ కాజా ముల్లా బురందీన్,కొండయ్య, అబ్దుల్లా, షేక్షావలి, దేవేంద్రారెడ్డి రమేష్ దాబా మనోహర్ రెడ్డి పెయింటర్ షరీఫ్, ఖదీర్ , శ్రీనివాసులు, జల్సా గౌస్ , బబ్లు , మండల ప్రచార కార్యదర్శి పెయింటర్ రఫీ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News