108 అంబులెన్స్ సేవలను మరింత బలోపేతం చేస్తూ… కొత్తగా 146 అంబులెన్స్‌లను క్యాంపు కార్యాలయం వద్ద లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు సీఎం వైయస్.జగన్. కొత్త 108 వాహనంలో వైద్య పరికరాలు, సౌకర్యాలను పరిశీలించారు ముఖ్యమంత్రి. కార్యక్రమంలో పాల్గొన్న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి కె వి ఉషాశ్రీచరణ్, రహదారులు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు(రాజా), ఎంపీ నందిగాం సురేష్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఎం టి కృష్ణబాబు, పలువురు ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు.







