రాష్ట్రంలో పెద్ద ఎత్తున గోదుమలను, బియ్యాన్ని ఇ-వేలం వేయడం జరుగుతుంది. అమరావతిలో ఉన్న భారత ఆహార సంస్థ (ఎఫ్.సి.ఐ) విభాగం ఈ నెల 5వ తేదీన 6,400 టన్నుల గోదుమను, 7,000 టన్నుల బియ్యాన్నిబహిరంగ మార్కెట్ పథకం కింద ఇ-వేలం వేయనున్నట్టు ప్రకటించింది. ఈ సంస్థ ప్రజా సంబంధాల విభాగానికి చెందిన బర్రె రాము ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ, గోదుమ, బియ్యం చిల్లర ధరలను స్థిరీకరించడానికి, ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ఈ చర్యను తీసుకుంటున్నట్టు తెలిపారు. గత జూన్ 28న మొదటిసారిగా ఇ-వేలం పద్ధతిలో 6,839 టన్నుల గోదుమలను విక్రయించడం జరిగింది. ఈ ఇ-వేలం పాటలో 11 మంది వేలంపాటదార్లు పాల్గొని 900 టన్నుల గోదుమను మొదటి దశలో తీసుకోవడం జరిగింది. ఇక నుంచి ప్రతి బుధవారం ఈ విధంగా ఇ-వేలం ద్వారా గోదుమలను, బియ్యాన్ని విక్రయించడం జరుగుతుందని, తదుపరి ఆదేశాలు జారీ అయ్యేవరకు ఈ విధానం కొనసాగుతుందని భారత ఆహార సంస్థ అధికారులు వెల్లడించారు.
E-auction: ఏపీలో గోదుమలు, బియ్యం ఇ-వేలం
ఇ-వేలం కింద 7,000 టన్నుల బియ్యం వేలం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES