Saturday, November 23, 2024
Homeహెల్త్Skin Cleanser: స్కిన్ క్లీనర్లు మీరే చేసుకుంటే..

Skin Cleanser: స్కిన్ క్లీనర్లు మీరే చేసుకుంటే..

కెమికల్ ఫ్రీ, సైడ్ ఎఫెక్ట్స్ లేని క్లెన్సర్స్ మీకు అందుబాటులోని వాటితోనే

చర్మాన్ని మెరిపించే ఇంటి క్లీన్సర్లు..
చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే క్లీన్సర్లను తప్పనిసరిగా వాడాలి. చర్మానికి హాని కలిగించని, ఇంట్లోనే చేసుకునే నేచురల్ క్లీన్సర్లు చాలా ఉన్నాయి. మీ చర్మ స్వభావానికి అనుగుణమైన క్లీన్సర్లను ఇంట్లో సులభంగా తయారుచేసుకోవచ్చు.

- Advertisement -

జిడ్డు చర్మంపై బాగా పనిచేసే ఇంట్లో తయారుచేసుకునే క్లీన్సర్ ఉంది. అదే నిమ్మ, చక్కెర మిశ్రమంతో చేసిన క్లీన్సర్. ఒక టీస్పూను నిమ్మరసంలో ఒక టీస్పూన్ చక్కెర కలిపి దానితో ముఖంపై జిడ్డు ఉన్న ప్రదేశాలలో వ్రుత్తాకారంలో మెల్లగా మసాజ్ చేయాలి. ఇలా వారానికి మూడుసార్లు చేయడం వల్ల చర్మంపై మలినాలు, బ్లాక్ హెడ్స్ వంటివి ఏర్పడవు. నిమ్మరసంలో స్కిన్ ను శుభ్రం చేసే విటమిన్ సి ఉంటుంది. ఇధి సహజసిద్ధమైన బాక్టీరియల్ ఏజెంట్. చక్కెరలో గ్లైకోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మంపై ఏర్పడిన బ్లాక్ హెడ్స్ ను పోగొట్టడమే కాకుండా ముఖ చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. జిడ్డు చర్మం వారికి ఉపయోగపడే మరో క్లీన్సర్ కూడా ఉంది.


పాలు, టొమాటో, కమలాపండు, నిమ్మ కాంబినేషన్ పేస్టు వీరికి మంచి క్లీన్సర్ గా పనిచేస్తుంది. బాగా పండిన టొమాటో, ఒక టీస్పూను కమలాపండు రసం, నిమ్మరసం, రెండు టేబుల్ స్పూన్ల పాలు వీటన్నింటినీ కలిపి మెత్తగా పేస్టులా చేయాలి. దీన్ని ఒక గ్లాస్ జార్ లో పెట్టి రిఫ్రిజిరేటర్ లో భద్రపరచాలి. ఇది వారం రోజుల వరకూ తాజాగా ఉంటుంది. దీన్ని కొద్దిగా తీసుకుని ముఖంపై రాసి పది నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్లతో ముఖం కడుక్కుని తువ్వాలుతో బాగా పొడిగా తుడుచుకోవాలి. పొడిచర్మం వారికి కొన్ని నేచురల్ క్లీన్సర్లు ఉన్నాయి. వాటిల్లో ఒకటి ద్రాక్ష, పాలు, ఆలివ్ నూనె కలిపిన క్లీన్సర్. గుప్పెడు ద్రాక్షపళ్లు, ఒక టీస్పూను పాలు, రెండు టేబుల్ స్పూన్ల వర్జిన్ ఆలివ్ ఆయిల్ తీసుకుని మూడింటినీ బాగా కలిపి మెత్తటి పేస్టులా చేయాలి. దాన్ని ముఖానికి రెండు నిమిషాల పాటు మెల్లగా రాసి అది చర్మంలో ఇంకడానికి ఐదు నిమిషాలు అలాగే దాన్ని వదిలేయాలి. తర్వాత గోరువెచ్చటి నీళ్లతో ముఖం కడిగి పొడి తువ్వాలుతో ముఖాన్ని బాగా తుడుచుకోవాలి.

ఆలివ్ ఆయిల్ చర్మానికి కావలసిన మాయిశ్చరైజర్ ని అందిస్తుంది. ఇంకొక డ్రై స్కిన్ క్లీన్సర్ కూడా ఉంది. బొప్పాయి, అలొవిరా, తేనె, పెరుగు కలిపిన మిశ్రమం కూడా పొడిచర్మం క్లీన్సర్ గా బాగా పనిచేస్తుంది. చర్మానికి కావలసిన సాంత్వనను అలొవిరా అందిస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల అలొవిరా జెల్ , పావు కప్పు బొప్పాయి ముక్కలు, అర టేబుల్ స్పూన్ ఆర్గానిక్ తేనె, ఒక టేబుల్ స్పూను పెరుగు వీటన్నింటినీ కలిపి మెత్తటి పేస్టులా చేయాలి. దీన్ని బాడీ క్లీన్సర్ గా కూడా ఉపయోగించవచ్చు. తేనె, బాదం స్క్రబ్ కూడా పొడిచర్మం వారికి పనికి వస్తుంది. గుప్పెడు బాదం పప్పులు తీసుకుని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి. ఇందులో రెండు టేబుల్ స్పూన్ల పాలు, అర టీస్పూను తేనె వేసి బాగా కలిపి మెత్తటి పేస్టులా చేయాలి. ఈ చిక్కటి పేస్టును ముఖంపై వ్రుత్తాకారంలో మెల్లగా మసాజ్ చేస్తూ రాయాలి. ఈ స్క్రబ్ లో పాలు మీకు నచ్చితే వాడొచ్చు. ఇలా ముఖానికి ఆ పేస్టును రాసుకుని కొన్ని నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆతర్వాత గోరువెచ్చటి నీటితో ముఖం కడుక్కోవాలి. తర్వాత పొడితువ్వాలుతో ముఖాన్ని బాగా తుడుచుకోవాలి.


అన్నిరకాల చర్మం వారికీ సరిపడే క్లీన్సర్లను కూడా ఇంట్లో తయారుచేసుకోవచ్చు. తేనె, పాలు రెండింటినీ సమపాళ్లల్లో తీసుకుని ముఖానికి రాసుకొని అది బాగా ఆరేవరకూ కొన్ని నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. తర్వాత గోరువెచ్చటి నీటితో కడుక్కుని పొడి తువ్వాలుతో ముఖం బాగా తుడుచుకోవాలి. అన్ని రకాల చర్మం వారికీ ఈ హోమ్ క్లీన్సర్ బాగా పనిచేస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News