Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Chittor: 'జగనన్న పాల వెల్లువ'లో భాగంగా అమూల్ భూమిపూజ

Chittor: ‘జగనన్న పాల వెల్లువ’లో భాగంగా అమూల్ భూమిపూజ

ఎట్టకేలకు 20 ఏళ్ల తరువాత చిత్తూరు పాల డైరీకి మోక్షం

‘జగనన్న పాలవెల్లువ’ పథకంలో మరో విప్లవాత్మక అడుగుగా చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ పనులు ప్రారంభయ్యాయి. ఈమేరకు జిల్లాలో జగన్ భూమి పూజ చేశారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా 20 ఏళ్లుగా మూతబడి ఉన్న చిత్తూరు డెయిరీకి ఉన్న రూ.182 కోట్ల అప్పులను పూర్తిగా తీర్చి, దానికి మరలా జీవం పోస్తూ అమూల్‌ సంస్ధతో ఒప్పందం చేసుకుని, అమూల్‌ ద్వారా రూ.385 కోట్ల పెట్టబడితో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు చిత్తూరులో భూమిపూజ చేశారు సీఎం వైయస్‌. జగన్‌.

- Advertisement -

చిత్తూరు డెయిరీ పునరుద్ధరణకు విచ్చేసిన ముఖ్యమంత్రి శంకుస్థాపన, శిలాఫలకం ఆవిష్కరించారు జగన్. జిసిఎంఎంఎఫ్, కైరా యూనియన్ ఏర్పాటు చేసిన 200+ అమూల్ పాల ఉత్పత్తుల స్టాల్, పాల సేకరణ కేంద్రంలో ఏర్పాటు అయివున్న మిల్క్ అనలైజర్, స్టిర్రార్, వేయింగ్ మిషన్, కంప్యూటర్ , ప్రింటర్ , డిస్ప్లే వంటివి పరిశీలించారు. ఏపిలో 3551 గ్రామాల్లో 307086 మహిళా పాడిరైతులు సభ్యులుగా ఉన్నారని అమూల్ ఇంచార్జ్ రవిచంద్ర, డా. నికుంజ సీఎంకు వివరించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించనున్న చిత్తూరు డైరీ నమూనా, ప్రస్తుతం పాడైన మిషనరీ ఫోటోలు, జగనన్న పాల వెల్లువ సేకరణ ఫోటో ఎగ్జిబిషన్ ను ముఖ్యమంత్రి జగన్ చూశారు.

ముఖ్యమంత్రి వెంట ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పర్యాటక మంత్రి ఆర్ కే రోజా, ఎం. పి. లు మిథున్ రెడ్డి, రెడ్డెప్ప, స్థానిక శాసన సభ్యులు శ్రీనివాసులు, తంబళ్ళ పల్లి ద్వారక నాద రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు , ఎం ఎల్ సి భరత్, తుడ చైర్మన్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సి ఎం ఓ సెక్రటరీ భరత్ గుప్త, ముఖ్యమంత్రి టూర్ కోర్దినేటర్ తలశిల రఘురామ్ , నగర మేయర్ అముద జి సి ఎం ఎం ఎఫ్ అమూల్ ఎం. డి . జయన్ మెహతా, చైర్మన్ శ్యామల్ భాయ్ పటేల్ , కైరా అమూల్ యూనియన్ ఎం. డి.అమిత్ వ్యాస్, చైర్మన్ విపుల్ కుమార్ పటేల్, స్పెషల్ సి ఎస్ అగ్రికల్చరల్ గోపాల కృష్ణ ద్వివేది , ఎపి డైరీ డెవెలప్ మెంట్ ఎం. డి. అహమ్మద్ బాబు, ప్రజాప్రతినిధులు, మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అరుణ , సౌత్ ఇండియా అమూల్ ఆపరేషన్ అధికారి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.

అమూల్ మహిళా పాడి రైతులకు ఈమేరకు అభివాదం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News