Friday, November 22, 2024
Homeచిత్ర ప్రభSharukh Khan surgery: షూటింగ్ లో షారూఖ్ కు గాయం, అమెరికాలో ఆపరేషన్

Sharukh Khan surgery: షూటింగ్ లో షారూఖ్ కు గాయం, అమెరికాలో ఆపరేషన్

గాయం, సర్జరీపై అధికారికంగా ప్రకటన చేయని షారూఖ్

కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ సినిమా షూటింగ్ లో గాయపడ్డారు.  దీంతో లాస్ ఏంజిల్స్ లో జరుగుతున్న షూటింగ్ లో ఆయన గాయపడగా అమెరికాలోనే ఆపరేషన్ జరిగింది.  ప్రస్తుతం ఇండియాకు తిరిగివచ్చిన ఆయన తన ఇంట్లో కోలుకుంటున్నారు.  అట్లీ డైరెక్షన్ లో వస్తున్న జవాన్ సినిమా షూట్ లో షారూఖ్ ముక్కుకు బలమైన గాయం తగిలింది.  ముక్కులోనుంచి తీవ్రంగా రక్త స్రావం కావటంతో మైనర్ సర్జరీ చేయాల్సి వచ్చింది.  దీంతో తన ముక్కుపై ఆయన బ్యాండేజ్ తో ఉన్నారు.

- Advertisement -

నయనతార, విజయ్ సేతుపతితో కలిసి జవాన్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు షారూఖ్. గత 4 ఏళ్లుగా సినిమాలకు పెద్ద బ్రేక్ ఇచ్చిన షారూఖ్ ఈ ఏడాది ఆరంభంలో పఠాన్ తో ప్రేక్షకులకు మంచి వినోదం పంచి, బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు.  ఈ ఏడాది మరో రెండు సినిమాలతో షారూఖ్ తన ఫ్యాన్స్ ను అలరించనున్నారు.  రాజ్ కుమార్ హిరానీ చిత్రం డుంకీ కూడా విడుదలకు సిద్ధమవుతుండగా మరోవైపు అట్లీ సినిమా జవాన్ కూడా ఈ ఏడాదే రిలీజ్ కానుంది.  డుంకీలో తాప్సీ పన్నూ హీరోయిన్ కాగా, జవాన్ లో దీపికా క్యామియో రూల్ ప్లే చేస్తున్నారు.  ఓవైపు కోల్కత్తా నైట్ రైడర్స్ ఐపీఎల్ టీం పనులు, మరోవైపు సొంత ప్రొడక్షన్ హౌస్ పనులు ఇంకోవైపు సినిమాలతో ఈ ఇయర్ బాలీవుడ్ బాద్షా ఫుల్ బిజీగా ఉన్నారు.

అదేంటో జవాన్ సినిమాకు ఆదినుంచే ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట సమంతను అనుకున్నారు, కానీ ఆమె బిజీగా ఉండటంతో పాటు తల్లి కావాలన్న ప్లాన్ లో భాగంగా కొత్త సినిమాలను సామ్ అప్పట్లో ఒప్పుకోలేదు. దీంతో లేడీ సూపర్ స్టార్ అయిన నయనతారను అట్లీ అప్రోచ్ అయ్యారు. అలా నయన్ డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీ ఈ సినిమాతో స్టార్ట్ కానుంది. అట్లీ-సామ్-నయన్ వ్యక్తిగతంగా మంచి ఫ్రెండ్స్ కూడా. ఇక ఆతరువాత నయన్ పెళ్లి, అంతకుముందు కోవిడ్ లాక్ డౌన్ కారణంగా సినిమా పనులు చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. తాజాగా షారూఖ్ ప్రమాదానికి గురై, సర్జరీ చేయించుకోవటం.. ఇలా జవాన్ కు చాలానే ఆటంకాలు తగులుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News