అమెరికాకు చేరిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి ఘనంగా స్వాగతం పలికారు ఎన్ అర్ ఐలు. మంత్రి ఎర్రబెల్లి పుట్టిన రోజును పురస్కరించుకొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. బిఅర్ ఎస్ జెండాలు కట్టి, మంత్రిని ఊరేగింపుగా ఆయన బస చేసే హోటల్ వరకు తీసుకెళ్లారు. అనేక మంది తెలుగువారు, ఆయన అభిమానులు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి పుష్ప గుచ్చాలు అందించి, స్వాగతం పలికి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వాషింగ్టన్ డిసి ఎయిర్ పోర్ట్ లో మంత్రికి ఘన స్వాగతం పలికిన దయన్న అభిమానులు, అనంతరం వందల కార్లతో ర్యాలీగా బయలు దేరి వెళ్లారు.