Friday, September 20, 2024
HomeతెలంగాణCheryala: ఆర్టీసీ ఉత్తమ డ్రైవర్ గా నాగిళ్ల శ్రీనివాస్

Cheryala: ఆర్టీసీ ఉత్తమ డ్రైవర్ గా నాగిళ్ల శ్రీనివాస్

జనగామ డిపోకు అరుదైన గౌరవం

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఆర్టీసీ ఏర్పాటు చేసిన బస్సులలో ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానం చేర్చడానికి ఉత్తమ ప్రతిభ కనబరిచిన డ్రైవర్లకు సన్మానంతో పాటు అవార్డును జనగామ డిపోకు చెందిన నాగిళ్ల శ్రీనివాస్ ఉత్తమ డ్రైవర్గా ఎంపికైయారు. ఆర్టిసి ఎండి విసి సజ్జనార్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. చేర్యాల పట్టణానికి చెందిన నాగిళ్ల శ్రీనివాస్ విధుల పట్ల అంకితభావంతో పనిచేయడంతో ఈ అవార్డు దక్కిందని జనగామ డిపోకు చెందిన సహ ఉద్యోగులు అధికారులు సిబ్బంది మిత్రులు అభినందనలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News