కర్నూలు జిల్లాలో రెండవ రోజు టిడిపి భవిష్యత్తుకి గ్యారెంటీ చైతన్య బస్సు యాత్ర ఆలూరు నియోజకవర్గం ఆస్పరిలో జిల్లా ఇన్చార్జులు మాజీ మంత్రులు కార్యకర్తలు భారీగా తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. ఆస్పరి నుండి చిన్నహోతూర్, పెద్దహోతూర్ గ్రామాల మీదుగా బస్సు యాత్ర కొనసాగింది. ఆలూరు నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్ ,మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఆధ్వర్యంలో ఈ బస్సు యాత్ర కొనసాగింది. ప్రజల నుండి అపూర్వ స్పందన వచ్చినది చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన భవిష్యత్తు గ్యారంటీ మినీ మేనిఫెస్టో వివరాలను జిల్లా టిడిపి అధ్యక్షుడు బిటి నాయుడు ప్రజలకు విన్నవించాడు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి జిల్లాలోని మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, నియోజకవర్గ ఇన్చార్జిలు తిక్కారెడ్డి ,KE శ్యామ్ బాబు పాల్గొన్నారు, వచ్చేది మన టిడిపి ప్రభుత్వము అని జగన్ ఒక ఛాన్స్ పేరుతో రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించారని ఆలూరు నియోజకవర్గం అధికారీ పార్టీ ఎమ్మెల్యే ,మంత్రి జయరామ్ ,ఇసుక మాఫియా అక్రమ కర్నాటక మద్యం ,ప్యాకాట కమిషన్లతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు అని ఆలూరు టిడిపి ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఘాటుగా విమర్శించారు,వేదావతి ప్రాజెక్టు , నగరడోన రిజర్వాయర్ పనులు నిలిచిపొయిన పట్టించుకోవడం లేదని , ఈ ప్రభుత్వం ఆరునెలలే అని వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని వేదావతి ప్రాజెక్టును , నగరడోణ రిజర్వాయర్ పూర్తి చేసి నియోజకవర్గ ప్రజలకు ,రైతులకు సాగునీరు ,తాగునీరు అందిస్తామని కోట్ల సుజాతమ్మ తెలిపారు. ఆలూరు నియోజకవర్గం లో రెండవ రోజు బస్సు యాత్ర కానసాగుతుందని, మూడవరోజు ఆదోని మంత్రాలయం ఎమ్మిగనూరు కర్నూల్ నియోజకవర్గాల మీదుగా బస్సు యాత్ర కొనసాగుతుందన్నారు.
TDP Bus yatra: టిడిపి భవిష్యత్తు గ్యారంటీ బస్సు యాత్ర
సంబంధిత వార్తలు | RELATED ARTICLES