Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Shilpa: ప్రజాస్వామ్య పరిరక్షణ జగన్ కే సాధ్యం

Shilpa: ప్రజాస్వామ్య పరిరక్షణ జగన్ కే సాధ్యం

జోరు వర్షంలోనూ కొనసాగిన గడప గడపకూ..

బండి ఆత్మకూరు మండలం కాకనురు గ్రామంలో ఎంపీడీఓ వాసుదేవ గుప్తా అధ్వర్యంలో శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి 106వ రోజు ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా గ్రామ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేని గజమాలతో సన్మానించారు.

- Advertisement -

ఎమ్మెల్యే శిల్పా మాట్లాడుతూ ప్రతి ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ, వైయస్సార్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకొన్నారు. నెల రోజుల పాటు జరిగే ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పథకాలు లబ్దిపొందని లబ్ది దారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ది చేకూర్చేటట్లు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. కులమతాలకు, పార్టీలకు అతీతంగా అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందించే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వమే అని అంబేడ్కర్ కలలు గన్న ప్రజాస్వామ్య పరిరక్షణ ముఖ్యమంత్రి జగన్ కే సాధ్యం అన్నారు. అనంతరం బండిఆత్మకూరు గ్రామానికి చెందిన ముంతల ఆంజనేయులు ఇల్లు గత కొద్దిరోజుల క్రితం ప్రమాదవ సాత్తు పూర్తిగా దగ్ధమైందని విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి గ్రామ నాయకులు తీసుకువెళ్లగా తన సొంత నిధులను 20000/-, రెడ్డి పరమేశ్వర రెడ్డి, 10000/- లు,శిల్పా భువనేశ్వర్ రెడ్డి5000/- లను అందజేశారు. అంగవైకల్యంతో బాధపడుతున్న చిన్నారిని ఎమ్మెల్యే పరామర్శించి 5000/- ల పింఛన్ వచ్చేలా చెయ్యాలని అధికారులను ఆదేశించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి పిల్లలకు నాణ్యమైన ఫుడ్ అందజేయాలని ఐసీడీఎస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం గ్రామములో నూతనంగా నిర్మిస్తున్న రామాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షంలో సైతం నిర్విరామంగా సాగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కొనసాగించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ పిడిసిఎల్ డైరెక్టర్ డాక్టర్ శశి కలారెడ్డి, దేరెడ్డి పరమేశ్వర్ రెడ్డి, ఎంపీపీ దేరెడ్డి చిన్న సంజీవరెడ్డి,
మండల కన్వీనర్ బారెడ్డి శ్రీనివాస రెడ్డి, మండల జేసీఎస్ కన్వీనర్ ముడిమేల పుల్లారెడ్డి, మాజీ ఎంపీపీ దేసు వెంకటరామిరెడ్డి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ విక్రమ్ సింహ నాయక్, మాజీ జెడ్పీటీసీ మద్దిలేటి, సర్పంచ్ నర్ల మహేశ్వర్ రెడ్డి, మాజీ సర్పంచ్లు నర్లసుబ్బారెడ్డి, జెక్కం శివారెడ్డి, దేరెడ్డి పుల్లారెడ్డి, నర్ల రామగోపాల్ రెడ్డి,నర్ల ప్రతాపరెడ్డి,జిల్లా గొర్రెల పెంపకం సంగం డైరెక్టర్ సుబ్బయ్య యాదవ్, వైయస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండల అధికారులు, గ్రామ సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, గృహ సారథులు ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News