అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు జగనన్న సురక్ష పథకం దోహదపడుతుందని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి పేర్కొన్నారు. నంద్యాల పట్టణం 3,4,5,6వ వార్డ్ సచివాలయ పరిధిలోని జగన్ అన్న సురక్ష ద్వారా లబ్ధిపొందిన 1,540 మంది లబ్దిదారులకు సరిఫికేట్లు పంపిణి చేశారు ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి. ఎంఎల్సి ఇసాక్, మున్సిపల్ ఛైర్మెన్ మాబున్నిసా, ఏపీ ఎస్పీడీసీఎల్ రాష్ట్ర డైరెక్టర్ శశికళ రెడ్డి, వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్ పామ్ షావలి, కౌన్సిలర్లు సమ్మద్, తబ్రీజ్, ఆరిఫ్, పురందర్ కుమార్. కో ఆప్షన్ సభ్యులు సలాముల్లా, పడకండ్ల సుబ్రమణ్యం, మాజీ కౌన్సిలర్ భీమినిపల్లె వెంకట సుబ్బయ్య, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్ధేశంతో ప్రభుత్వం సురక్ష పథకం ప్రవేశపెట్టిందని, సంక్షేమ పథకాలు అందని వారికి ఇంటింటికి వలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది వెళ్లి అన్ని రకాల సర్టిఫికెట్లను ఇంటికే అందజేస్తారన్నారు. దరఖాస్తు చేసుకున్న ఏడు రోజుల్లో ప్రతి ఒక్కరికి జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌కార్డు, ఫోన్ నెంబర్ లింకు, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలన్నింటికీ అందజేస్తారని జేసీ చెప్పారు. సురక్ష పథకం ద్వారా ఆగస్టు నెల వరకు ఏ సమస్య ఉన్నా వలంటీర్లకు తెలియజేయాలని, ఇంటింటికి తిరిగినప్పుడు పూర్తి సమాచారం ఇవ్వాలని బాండ్లు అందజేసేటప్పుడు పూర్తి ఉచితంగా అందజేస్తారని వివరించారు.