రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డితోనే విద్యాభివృద్ధి సాధ్యమని గూడూరు నియోజవర్గ ఎమ్మెల్యే డాక్టర్ జరదొడ్డి సుధాకర్ అన్నారు. గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులకు అమ్మబడి పథకం పంపిణీ మెగా చెక్కును ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తూ విద్యార్థులకు అవసరమైన నూతన పథకాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్నారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను విద్యార్థులు సద్వినియం చేసుకొని విద్యలో మంచి ప్రతిభ ప్రతిభ సాధించాలని కోరారు. తద్వారా భవిష్యత్తులో ఉన్నత స్థానంలో నిలిచిపోతారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జున్నుపాల వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ పిఎన్అస్లాం, లక్ష్మన్న, కమిషనర్ ప్రసాద్, ఎంఈఓ-2 నాగరాజు, పత్తిరంగడు, కౌన్సిలర్లు మద్దిలేటి, రత్నమ్మ, వైసీపీ జిల్లా పబ్లిసిటీ వింగు ఎల్ వెంకటేశ్వర్లు, స్థానిక ఎస్సై పవన్ కుమార్, వైసీపీ నాయకులు తదితరులు ఉన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారమే ‘జగనన్న సురక్ష’: ఎమ్మెల్యే డాక్టర్ జరదొడ్డి సుధాకర్
పేద ప్రజల సమస్యల పరిష్కారమే జగనన్న సురక్ష కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే డాక్టర్ జరదొడ్డి సుధాకర్ అన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా గూడూరు పట్టణంలోని రెండవ సచివాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ జరదొడ్డి సుధాకర్ పర్యటించి ఆయా శాఖల అధికారులచే ప్రజలకు ఉచితంగా సర్టిఫికెట్లు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ ఒక్కరు సమస్యలతో బాధపడకూడదని లక్ష్యంతోనే జగనన్న సురక్ష కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కారం అవుతుందని గుర్తు చేశారు. ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లతో పాటు సంక్షేమ పథకాల అమలులో కూడా ఈ కార్యక్రమం రూపు దాల్చుతుందని ఎమ్మెల్యే చెప్పారు. దేశంలో ఎక్కడలేని విధంగా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు, అభివృద్ధిని చేపడుతుంటే ప్రతిపక్ష పార్టీ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తూ తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జూపాల వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ పిఎన్ అస్లాం, లక్ష్మన్న, జిల్లా పబ్లిసిటీ వింగ్ ఎల్ వెంకటేశ్వర్లు, వైసిపి పట్టణ కన్వీర్ జులుపాల ఆబెల్, కమిషనర్ ప్రసాద్, కౌన్సిలర్లు, మద్దిలేటి, మండల వైసీపీ నేతలు దండు శీను తదితరులు పాల్గొన్నారు.