Thursday, September 19, 2024
HomeదైవంKomurelli: 12 కోట్ల వ్యయంతో క్యూ లైన్ కాంప్లెక్స్

Komurelli: 12 కోట్ల వ్యయంతో క్యూ లైన్ కాంప్లెక్స్

మల్లన్నకు పట్నం వేసి కళ్యాణంలో పాల్గొన్న మంత్రి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆలయాలకు మహర్ధశ వచ్చిందని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారిని మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మల్లన్నకు పట్నం వేసి కళ్యాణంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మల్లన్న ఆలయ ప్రాంగణంలో 12కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన క్యూలైన్ కాంప్లెక్స్ నిర్మాణానికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. సీఎం కేసిఆర్ చొరవతో మల్లన్న ఆలయం దినదిన అభివృద్ధి చెందుతుందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆలయ అభివృద్ధికి 36కోట్ల నిధులను కేటాయించామని తెలిపారు.

ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ పూర్తి చేసి ఆ నీటితో సీఎం కేసిఆర్ మల్లన్న స్వామివారి కాళ్ళను కడిగారని అన్నారు. గతంలో కరువు ప్రాంతంగా ఉన్న కొమురవెల్లి ప్రాంతం కాలంతో పని లేకుండా, వర్షాలతో అవసరం లేకుండా రైతులు మల్లన్న సాగర్ నీటితో రెండు పంటలను పండిస్తున్నారని, మల్లన్న స్వామి ఆశీస్సులతో వర్షం కోసం ఎదురుచూపులు చూడకుండా కాలేశ్వరం ద్వారా వచ్చే జనాలు ఉన్నందున రైతులు ధైర్యంగా నమ్మకంతో వరి నారు పోచారని మంత్రి హరీష్ రావు అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ధర్మకర్తల మండలి చైర్మన్ ఆలయ ధర్మకర్తలు పూజారులు ఒగ్గు పూజారులు టిఆర్ఎస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News