Saturday, November 23, 2024
HomeతెలంగాణKaushik Reddy: ఆలయాల నిర్మాణంతో భక్తి భావం పెరుగుతుంది

Kaushik Reddy: ఆలయాల నిర్మాణంతో భక్తి భావం పెరుగుతుంది

పెద్దమ్మ బోనాల వేడుకలలో కౌశిక్

గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణం చేపడుతున్న ఆలయాలతో స్థానిక ప్రజల్లో భక్తి భావం పెరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లి, చిన్నకోమటిపల్లి గ్రామాలలో నిర్వహించిన పెద్దమ్మ తల్లి బోనాల వేడుకలలో ఆయన పాల్గొన్నారు. ఆయా గ్రామాల ముదిరాజ్ కులస్తులు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి నిర్మాణం చేపట్టిన యాదాద్రి నేడు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పది ఎకరాల విస్తీర్ణంలో సర్వాంగ సుందరంగా నిర్మించుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు.

- Advertisement -

గ్రామ గ్రామాన ఆలయాల నిర్మాణంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలందరిలో భక్తి భావం పెరిగి ఒకరి పట్ల ఒకరు స్నేహపూర్వక వాతావరణం అలవర్చుకునేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. చిన్నకోమటిపల్లి గ్రామంలో ముదిరాజ్ కులస్తుల ఇలవేల్పైన పెద్దమ్మ తల్లి గుడి నిర్మాణానికి ప్రభుత్వపరంగా రూ,1౦ లక్షల నిధులు మంజూరు చేసేందుకు తన వంతు సహకారం అందిస్తానన్నారు. శ్రీరాములపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి గుడి పరిసరాల్లో ప్రహరీ గోడ నిర్మాణానికి అవసరమైన నాలుగు లక్షల రూపాయలను దేవదాయ శాఖ నుండి మంజూరు చేయించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. ప్రస్తుతం తన వంతు విరాళంగా లక్ష రూపాయల నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సరిగొమ్ముల పావని వెంకటేష్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు మోటపోతుల ఐలయ్య, సర్పంచులు చిట్ల సరోజన నాగన్న, తిప్పరబోయిన మొగిలి, బీఆర్ఎస్ నాయకులు మూడెడ్ల కుమారస్వామి, దేశిని కోటి, జిల్లెల్ల తిరుపతిరెడ్డి, నెల్లి శేషు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News