థ్రెడ్స్ లాంచింగ్ చాలా సెన్సేషన్ గా మారింది. లాంచ్ అయిన తొలి క్షణాల్లోనే థ్రెడ్స్ ను నెటిజన్స్ అక్కున చేర్చుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా మార్క్ జూకర్ బర్గ్ అనే పేరుకున్న బ్రాండ్ వాల్యూ చెప్పాలంటే థ్రెడ్స్ లాంచ్ సక్సెస్ చెబితే సరిపోతుందన్నట్టు తయారైంది. అసలే మెటా ఫ్లాప్, ఫేస్ బుక్ ఆ మాత్రంగా ఉన్న ఈ టైంలో జూకర్ బర్గ్ లాంచ్ చేసిన తన మార్క్ మైక్రో బ్లాగింగ్ సైట్ చాలా క్రేజీగా మారింది.
మస్క్ చేతికి వచ్చాక గడ్డుకాలం ఎదుర్కొంటున్న ట్విట్టర్ ను థ్రెడ్స్ పక్కకు తోసేయటం ఖాయమనే అంచనాలను పెంచేస్తోంది థ్రెడ్స్. థ్రెడ్స్ లాంచ్ అయిన తొలి 2 గంటల్లోనే 2 మిలియన్ల మంది సైన్ అప్ అవగా, తొలి 4 గంటల్లో ఏకంగా 5 మిలియన్లు అంటే ఏకంగా 50 లక్షల మంది థ్రెడ్స్ పై పడ్డారు. దీంతో అప్పుడే ట్విట్టర్ వర్సెస్ థ్రెడ్స్ గా పరిస్థితి మారిపోయింది. మొత్తానికి చాలాకాలం తరువాత మెటా సీఈవో ఫుల్ ఖుష్ అయిపోయారన్నమాట.
Twitter Vs Threads: 2 గంటల్లో 20 లక్షల మంది, 4 గంటల్లో 50 లక్షల మంది
థ్రెడ్స్ సెన్సేషనల్ హిట్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES