Saturday, November 23, 2024
Homeటెక్ ప్లస్Mark Zuckerberg: 11 ఏళ్ల తరువాత ట్వీట్ చేసిన ఫేస్ బుక్ ఫౌండర్

Mark Zuckerberg: 11 ఏళ్ల తరువాత ట్వీట్ చేసిన ఫేస్ బుక్ ఫౌండర్

'థ్రెడ్స్' ప్రమోషన్ ట్విట్టర్ లో

మెటా సీఈవో మార్క్ జూకర్ బర్గ్ 11 ఏళ్ల తరువాత ట్వీట్ చేయటం టెక్ వల్డ్ లో అతి పెద్ద వార్తగా మారింది.  దీని వెనుక ఆసక్తికరమైన చాలా పెద్ద కారణం ఉండటం అసలు విషయంగా సోషల్ మీడియాలో డిస్కషన్ పాయింట్ గా మారింది.  ఓపన్ అండ్ ఫ్రెండ్లీ పబ్లిక్ స్పేస్ ఫర్ కాన్వర్జేషన్ అంటూ సరికొత్త మైక్రోబ్లాగింగ్ సైట్ థ్రెడ్స్ ను లాంచ్ చేసిన ఫేస్ బుక్ ఫౌండర్ జూకర్ బర్గ్ ఈ రోజు మార్నింగ్ ట్విట్టర్ లో పలకరించారు.  స్పైడర్ మ్యాన్ మీమ్ తో ఆయన తన ట్విట్టర్ ఫాలోయర్స్ ను పలకరించారు.  డబుల్ ఐడెంటిటీ అనే 1967 నాటి స్పైడర్ మాన్ కార్టూన్ ను ఆయన ట్వీట్ చేశారు.  ఒక బిలియన్ కంటే ఎక్కువమంది ఉపయోగించుకునే కామన్ ప్లాట్ ఫామ్ గా ఎదగగలిగే సామర్థ్యమున్న ట్విట్టర్ ఎందుకో దీన్ని అందుకోలేకపోయిందని, థ్రెడ్స్ కు ఇంత పెద్ద టార్గెట్ రీచ్ కావటానికి టైం పట్టచ్చని జూకర్ బర్గ్ అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News