వెర్రి వేయి రకాలన్నట్టు ఆమెకు టాటూల పిచ్చి. అందుకే ఒళ్లంతా తూట్లు పొడిపించుకుంది. ఇంతకీ ఇన్ని అంటే అక్షరాలా 800 టాటూలు వేయించుకున్న ఆమె పరిస్థితి ఇప్పుడేమైందనేగా మీ డౌట్. చూసేందుకు అసహ్యంగా కనిపించే ఈ టాటూలతో ఉన్న ఈ బ్రిటీష్ ఆమెకు ఎవరూ ఉద్యోగం ఇవ్వట్లేదు. మరి పొట్టకూడు జరిగేదెలా? ఇప్పుడిదీ ఈమె అసలు సమస్య. వారానికి కనీసం 3 కొత్త టాటూలు వేయించుకునే ఈ 46 ఏళ్లామెకు కనీసం బాత్రూములు కడిగే ఉద్యోగం కూడా ఇవ్వట్లేదని వాపోతోంది. 20 ఏళ్ల వయసులో ఉన్నప్పటినుంచీ ఈమెకు టాటూల పిచ్చి పట్టుకుంది, ప్రస్తుతం ఇద్దరు పిల్లల తల్లి కానీ ఉద్యోగం మాత్రం ఇచ్చేవాళ్లు లేరు. ఇదండీ ఈమె గోడు.
సూపర్ హిప్ ఫ్యాషన్ అయిన టాటూలను ప్రేమించేవారు ఎంత మంది ఉన్నారో అసహ్యించుకునేవాళ్లు కూడా అంతేమంది ఉన్నారు. అందుకే మీరు తొందరపడి టాటూలు ఎక్కడపడితే అక్కడ వేయించేసుకుని కొత్త చిక్కులు చేతులారా తెచ్చుకోకండి.