Monday, November 25, 2024
Homeనేషనల్Central ministers in que: క్యూలో కేంద్ర మంత్రులు, ఆయనతో భేటీ కోసం

Central ministers in que: క్యూలో కేంద్ర మంత్రులు, ఆయనతో భేటీ కోసం

లోక్ సభ బరిలోకి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ?

నద్దాను కలిసేందుకు క్యూ కట్టిన కేంద్ర మంత్రులు అనేది ఇప్పుడు ఢిల్లీలో లేటెస్ట్ డెవలప్మెంట్ గా మారింది. ఎక్కడ తమ స్థానాలు గల్లంతవుతాయేమోనని, తమ ప్రాధాన్యతలు తగ్గుతాయేమోనన్న భయాలతో ముందస్తు వ్యూహాలతో బీజేపీ జాతీయ అధ్యక్షుడిని కలిసేందుకు కేంద్ర మంత్రులంతా క్యూ కట్టారు.  ఏ క్షణమైనా కేంద్ర మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయవచ్చనే అంచనాలున్న ప్రస్తుత తరుణంలో నద్దాను కలిసేందుకు మంత్రులు పోటీ పడుతున్నారు.  2024 లోక్ సభ ఎన్నికలకు కనీసం 9 నెలలు కూడా లేని ఈ టైంలో ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలు కలిసి ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలనే కసిలో ఉన్నారు.  ఇందుకు అనుగుణంగా పార్టీని, ప్రభుత్వాన్ని ప్రక్షాళన చేసే పనుల్లో తలమునకలై ఉన్నారు. 

- Advertisement -

ఆ 4 రాష్ట్రాలే స్పెషల్ టార్గెట్

సంస్థాపరంగా పార్టీలో అవసరమైన మార్పులన్నీ శరవేగంగా చక్కబెడుతున్న కమలనాథులు ఇందులో భాగంగా నాలుగు రాష్ట్రాలకు కొత్త బీజేపీ సారథులను ప్రకటించి, వారికి లక్ష్యాలు, రోడ్ మ్యాప్ ఇచ్చేసింది.  ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరుగనున్న తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలపై ప్రత్యేక కసరత్తు చేస్తున్న బీజేపీ అధిష్టానం ఇందుకు అనుగుణంగా పార్టీలో, కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేపడుతోంది.

ప్రత్యక్ష ఎన్నికల్లో నిర్మలా సీతారామన్?

ఈనేపథ్యంలో పలువురు కేంద్ర మంత్రులు నద్దాతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు.  ఇలా నద్దాతో భేటీ అయిన మొదటి మంత్రి నిర్మలా సీతారామన్ కావటం మరో విశేషం.  ప్రస్తుతం కేంద్ర ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న నిర్మలా రాజ్యసభ సభ్యురాలు కాగా ఆమెను లోక్ సభ బరిలో దించే యోచనలో ఉన్నారు మోడీ-షా.   జ్యోతిరాదిత్య సింధియా, అర్జున్ రామం మెఘ్వాల్, కిరణ్ రిజిజు, గజేంద్ర షెఖావత్ వంటివారంతా ఢిల్లీలోని బీజేపీ హెడ్ క్వార్టర్స్ కు వెళ్లొస్తున్నారు.  ఈనెల 20న పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభం కానుండగా ఈలోగా కేంద్ర కేబినెట్ సమూల ప్రక్షాళన జరిగే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ హెడ్ క్వార్టర్స్ కేంద్ర మంత్రులు, వారి బలగంతో కళకళలాడుతూ సందడిగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News