Viral video : ఒకప్పుడు పెళ్లంటే వారం పది రోజుల ముందుగానే బంధువులు, స్నేహితులు పెళ్లి వారి ఇంటికి వచ్చి పెళ్లి పనుల్లో సాయం చేసేవారు. దీంతో అప్పట్లో పెళ్లి హడావుడి తప్ప గొడవలు, కొట్లాటలు వంటివి ఉండేవి. కాదు. మరీ ఇప్పుడా పరిస్థితి మారింది. తీరిగ్గా తాళి కట్టే సమయానికి వెళ్లామా..? మనకు మర్యాదలు జరిగాయా..? కొంచెం ఏదీ తక్కువైనా సరే నానా రసభ చేస్తూ పెళ్లి చేసుకునే వారికి సంతోషం లేకుండా చేస్తున్నారు.
ఓ వైపు సంప్రదాయ బద్దంగా వివాహ తంతు జరుగుతోంది. మండలంలో ఉన్న పురోహితుడు పెళ్లి మంత్రాలను పఠిస్తున్నాడు. వారి ఆచారంలో భాగంగా పెళ్లికుమార్తె వరుడికి హారతి ఇస్తోంది. ఓ వైపు తంతు కొనసాగుతుండగా వీరికి ఎదురుగా ఉన్న అతిథుల్లో ఏదో విషయమై అలజడి చెలరేగింది. ఇక అంతే వారిలోనే వారు గ్రూపులుగా విడిపోయి కొట్లాడుకున్నారు. దీంతో పెళ్లి వాతావరణం కాస్త గందరగోళంగా మారింది.
దీన్ని గమనించిన పెళ్లి కొడుకు వేదిక దిగి వచ్చేందుకు యత్నిచగా బంధువులు అతడిని ఆపారు. అయితే.. ఇది ఎప్పుడు ఎక్కడ జరిగిందో తెలీదు. ఆర్కే రాజు అనే వ్యక్తి ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. దీనిపై నెటీజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కొందరు మీరేం అతిథులు.. పెళ్లికి వచ్చారా.. లేదా గొడవకు వచ్చారా..? అని ఓ యూజర్ కామెంట్ చేయగా.. వీళ్లు ఇంతే ఇక మారరు అంటూ మరొకరు అన్నారు.