Avatar 2: ప్రపంచ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘అవతార్: ద వే ఆఫ్ వాటర్’. ‘అవతార్’ మూవీకి సీక్వెల్‌గా జేమ్స్ కామెరూన్ రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 16న విడుదల కాబోతుంది. ఈ హాలీవుడ్ చిత్రం అనేక భారతీయ భాషల్లో డబ్ కానుంది. తెలుగులో కూడా విడుదలవుతోంది. అయితే, తెలుగు డబ్బింగ్‌కు ఒక ప్రత్యేకత ఉంది.
అదే ప్రముఖ తెలుగు దర్శక రచయిత అవసరాల శ్రీనివాస్ సంభాషణలు రాయడం. అవసరాల ఈ చిత్రానికి డైలాగ్స్ రాసిన విషయం తాజాగా వెల్లడైంది. తన చిత్రాల్లో అవసరాల శ్రీనివాస్ ఆకట్టుకునే, తెలుగుతనంతో కూడిన డైలాగ్స్ రాస్తుంటారు. అలాంటిది ఆయన ఇప్పుడు అవతార్ సీక్వెల్ మూవీకి తెలుగులో డైలాగ్స్ రాయడంతో మరింత ఆసక్తి కలుగుతోంది. ఆయన ఎలాంటి సంభాషణలు రాసుంటారో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలుగుతోంది. ఇప్పటికే విడుదలైన అవతార్ ట్రైలర్లు ఆకట్టుకునేలా ఉన్నాయి.
మూవీ లవర్స్ ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దేశవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్‌లో కూడా ఈ చిత్రం దుమ్ముదులుపుతోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఏడు కోట్ల రూపాయలకుపైగా వసూళ్లు సాధించింది. రిలీజ్ నాటికి ఈ సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. దేశంలో గతంలో వచ్చిన డబ్బింగ్ చిత్రాల రికార్డులు అన్నింటినీ ‘అవతార్–2’ బద్ధలు కొడుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.