Friday, September 20, 2024
HomeతెలంగాణKaleswaram water: ఆవిష్కృతమైన అద్భుత ఘట్టం ఎస్సారెస్పీని ముద్దాడిన కాళేశ్వరం జలాలు

Kaleswaram water: ఆవిష్కృతమైన అద్భుత ఘట్టం ఎస్సారెస్పీని ముద్దాడిన కాళేశ్వరం జలాలు

కాళేశ్వరం జలాలను ఆహ్వానిస్తూ ప్రత్యేక పూజలు

బాల్కొండ నియోజకవర్గంలోని ముప్కాల్ పంపు హౌజ్ నుండి ఎస్సారెస్పీ జలాశయంలోకి వరద కాలువ ద్వారా ఎదురెక్కి వచ్చిన కాళేశ్వరం జలాలను రాష్ట్ర శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి,ఆర్టీసీ ఛైర్మెన్ బాజీ రెడ్డి గోవర్ధన్ లతో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కలిసి విడుదల చేసి కాళేశ్వరం జలాలను ఆహ్వానిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

- Advertisement -

కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి,ఎమ్మేల్యేలు జీవన్ రెడ్డి, రేఖా నాయక్,విఠల్ రెడ్డి, జెడ్పీ ఛైర్మెన్ విఠల్ రావు,కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, మహిళా సాధికారత అభివృద్ది సంస్థ చైర్ పర్సన్ ఆకుల లలిత, మాజి ఎమ్మెల్సీలు వి.జి గౌడ్, రాజేశ్వర రావు, నాయకులు డా.మధు శేఖర్, కోటపాటి నర్సింహ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కామెంట్స్

ఈరోజు రైతులకు సువర్ణ దినం. 300 కిలోమీటర్లు నీరు ఎదురెక్కటం చాలా అద్భుతం. పై భాగం లో ఉన్న ఎస్సారెస్పీ కి గోదావరి జలాలు రప్పించిన మొనగాడు సీఎం కేసీఆర్.. అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యం చేసి చూపించిన గొప్ప వ్యక్తి కేసీఆర్.. 2001 లో జలసాధన సభ లో కేసీఆర్ గోదావరి జలాలను రైతులకు అందిస్తాం అన్నపుడు నాకు కూడా ఆశ్చర్యం వేసింది. కానీ కేసీఆర్ కృషి ,విజన్ వల్ల ఇది సాధ్యం అయింది. ప్రాణహితలో గోదావరి కలిసే ప్రాంతం నుండి ఎస్సారెస్పీ వరకు 8 పంపు హౌజ్ లు నిర్మించి నీటిని తరలించాం.

ఇది కేసిఆర్ అద్భుతమైన సృష్టి..

రైతులు వర్షాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా…ఎస్సారెస్పీ పునరుజ్జీవం పథకంతో రివర్స్ పంపింగ్ ద్వారా తెచ్చిన కాళేశ్వరం జలాలు పంటలకు అందిస్తాం. రైతుల్లో మొఖాల్లో ఆనందం నింపిన కేసిఆర్ గారికి ఎస్సారెస్పీ ఆయకట్టు,నిజామాబాద్ జిల్లా రైతుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు.. “రోజుకు 0.5 టిఎంసి చొప్పున నీటిని 60 రోజుల పాటు 30 టిఎంసిలు ఎస్సారెస్పీ లో నింపుకోవాలి అని కేసిఆర్ నిర్ణయించి నీటి కేటాయింపులు పై లెక్కలు వేస్తున్న సందర్భంలో స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి గారు నిజాంసాగర్ ఆయకట్టు రైతులకు 5టిఎంసిలు అడిగారు. ఆ ఏర్పాట్లు చూడాలని ఆదేశించారని మంత్రి తెలిపారు. లక్ష్మిపుత్రుడు పోచారం శ్రీనివాస రెడ్డి గారంటే కేసిఆర్ గారికి అంత ఇష్టమని ఆయన అక్కడ లేకున్నా ఆయన చెప్పిన విషయం ముఖ్యమంత్రి గారికి ఆ సమస్య గుర్తుందనీ, ఎవరిని కేసిఆర్ మర్చిపోరని, ఆయనకు అన్ని తెల్సు అని మంత్రి వేముల ఈ సందర్బంగా గుర్తు చేశారు.”

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News