IND vs BAN 1st test : బంగ్లాదేశ్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు ముందు పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీని ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ టెస్టు సిరీస్‌లో విరాట్ కనీసం ఓ శతకం అయినా సాధిస్తే ఒకే ఏడాదిలో మూడు ఫార్మాట్లలో శతకాలు బాదిన అరుదైన ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకోనున్నాడు.
ఈ ఏడాది ఆసియాకప్‌లో ఆఫ్గానిస్తాన్ టీ20ల్లో సెంచరీ చేసిన కోహ్లీ, మూడో వన్డేలో బంగ్లాదేశ్‌పై శతకం బాదాడు.ఇక రేపటి నుంచి ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్‌లో సెంచరీ చేస్తే గనుక అరుదైన ఘనతను అందుకోనున్నాడు. మహేలా జయవర్థనే(2010), సురేశ్ రైనా(2010), దిల్షాన్(2011), అహ్మద్ షెహజాన్(2014), తమీమ్ ఇక్భాల్(2016), కేఎల్ రాహుల్(2016), రోహిత్ శర్మ(2017) డేవిడ్ వార్నర్(2019), బాబర్ అజామ్(2022) ఇప్పటికే ఈ జాబితాలో ఉన్నారు. వీరి సరసన కోహ్లీ నిలవనున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ ఇప్పటి వరకు 72 సెంచరీలు చేశాడు. అత్యధిక శతకాలు చేసిన జాబితాలో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలతో తొలి స్థానంలో ఉండగా కోహ్లీ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.
రేపటి(బుధవారం) నుంచి ప్రారంభం అయ్యే టెస్ట్ సిరీస్‌లో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా తొలి టెస్టుకు అందుబాటులో లేకపోవడంతో కేఎల్ రాహుల్ సారథ్య బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇక ఈ సిరీస్‌కు రిషబ్ పంత్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసిన బీసీసీఐ ఎందుకనో అతడిని ఆ బాధ్యతల నుంచి తప్పించింది. టెస్ట్ స్పెషలిస్టు పుజారాకు ఆ బాధ్యతలు అప్పగించింది.