పెదవులు మరింత అందంగా…
దొండపండులాంటి పెదవులు చూడడానికి ఎంతో అందంగా ఉంటాయి. అలాగ మీ పెదవులు మరింత అందంగా కనిపించాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయి. వీటిని పాటిస్తే పెదవులు ముద్దుగా, బొద్దుగా, మరింత వన్నెతో , రెట్టింపు అందాన్ని చిందిస్తూ కనిపిస్తాయి. అంతేకాదు నలుగురిలో మీరు ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తారు కూడా. అలాంటి కొన్ని చిట్కాలలో ఒకటి మీ టూత్ బ్రష్ ని ఉపయోగించి పెదవులను గులాబీరంగులో మరింతగా మెరిసేలా చేయొచ్చు. నీళ్లల్లో టూత్ బ్రష్ ను ముంచి దానితో పెదవులపై గుండ్రంగా మసాజ్ చేస్తూ సున్నితంగా రబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మీ పెదవులు గులాబీ రంగులో మెరుస్తూ పెదవుల అందం రెట్టింపు అవుతుంది. ఇంకొక టిప్ ఏమిటంటే మీ పైపెదవుల మధ్య ఉన్న చర్మంపై హైలైటర్ ను అద్దితే పెదవులు పెద్దవిగా కనిపిస్తాయి. మరో సహజమైన టిప్ ఉంది.
చక్కెర పెదవులకు సహజసిద్ధమైన ఎక్స్ ఫొయిలెంట్ గా పనిచేస్తుంది. చక్కెరలో కొద్దిగా కొబ్బరినూనె కలిపి దానితో పెదవులను స్క్రైబ్ చేయాలి. అలా చేయడం వల్ల పెదవులు గులాబీ రంగులో మరింతగా మిల మిల లాడుతూ కనిపిస్తాయి. పెదవులను చక్కటి ఆక్రుతితో కనిపించేలా లిప్ లైనర్లు ఉపయోగపడతాయి. అయితే మీ పెదవుల రంగు కన్నా మరింత థిక్ గా మీ లిప్స్ కనిపించాలంటే లిప్ లైనర్ అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల మంచి రంగుతో మీ పెదవులు రిచ్ నెస్ ను ప్రతిఫలిస్తాయి. పెదవులకు డార్క్ లిప్ షేడ్స్ వాడితే అవి ఫ్లాట్ గా కనిపిస్తాయి. చిన్నవిగా కూడా కనిపిస్తాయి. అదే లైట్ లిప్ కలర్స్ వాడితే మీ పెదవుల సహజసిద్ధమైన రంగును మరింత పెంచి అందంగా కనిపించేలా చేస్తాయి.
మీ లిప్స్ అందాలు అందరికీ ఆకట్టుకునేలా కనిపించాలంటే న్యూడ్ లేదా పేల్ పింక్ షేడ్ ను పెదవులకు అప్లై చేయాలి. పెదవులు మెరుస్తూ కనిపిస్తే అవి చిందించే అందం మాటల్లో చెప్పలేము. మెరిసే లిప్ గ్లోస్ ను పెదవుల మధ్యభాగంలో అప్లై చేస్తే పెదవులు చూడడానికి ఎంతో బాగుంటాయి. ఐస్ కూడా పెదవులను సహజమైన అందంతో మెరిసేలా చేస్తుంది.
ఐస్ క్యూబ్ తో రెండు నిమిషాలు పెదవులపై మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల పెదవులు ఎర్రగా, బొద్దుగా కనిపిస్తాయి. పెదవుల అందాన్ని రెట్టింపు చేసే నేచురల్ లిప్ మాస్కు కూడా ఉంది. దీన్ని రాసుకుంటే పెదవులు గులాబీ వర్ణంలో మరింతగా ఆకట్టుకునేలా కనిపిస్తాయి. అల్లం పొడి, కయెన్న పొడి, దాల్చినచెక్క పొడి, పెప్పర్ మెంట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ వీటన్నింటినీ కలిపి పేస్టులా చేసి దానితో 20 సెకన్లపాటు పెదవులను మసాజ్ చేసి రెండు మూడు నిమిషాలు దాన్ని అలాగే ఉంచాలి. ఇలా చేస్తే మీ పెదవుల అందం రెట్టింపు అవుతుంది.