ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని రహదారుల అభివృద్ధి దిశగా మరో ముందడుగు పడిందని ఎమ్మెల్యే గంగుల బిజేంద్ర రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే గంగుల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి నియోజకవర్గంపై రహదారులపై ప్రత్యేక చొరవ చూపాలని ప్రత్యేకంగా కోరగా స్పందించన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గానికి మూడు కొత్త రోడ్లు 8 కోట్లు కేటాయించారన్నారు. ఆర్ అండ్ బి కొత్త రోడ్ల నిర్మించే జీవో ఆర్టీ నెంబర్ 179 ఈనెల 5వ తేదీన ప్రణాళికను ఆమోదించారన్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని ఆళ్లగడ్డనుండి అహోబిలం వరకు రోడ్డు వేశారు మిగిలిన రోడ్డు 3 కోట్లతో, అలాగే సుద్ధపల్లె రోడ్డు నుండి వయా చిన్న కందుకూరు సంబంధించి 3.15 కోట్లతో, కంపమళ్ల మెట్ట నుండి డబ్ల్యూ గోవిందిన్నే వరకు 1. 75 కోట్లతో నూతనరోడ్ల పనులు త్వరలోనే ప్రారంభిస్తారని ఎమ్మెల్యే గంగుల తెలిపారు. శుద్ధపల్లి రోడ్డు నుండి వయా చిన్న కందుకూరు సంబంధించిన రోడ్డు నిర్మాణం అయితే ఆ ప్రాంతంలో ఉన్న భైరవ స్వామి దేవాలయానికి భక్తులు రావడానికి వీలుంటుందన్నారు. మిగిలిన అహోబిలం రోడ్డు పూర్తి అయితే పుణ్యక్షేత్రానికి రాకపోకలు ఇంకా పెరుగుతాయన్నారు. కంపమళ్లమెట్ట నుండి డబ్ల్యూ గోవిందిన్నేకు ఆ చుట్టుపక్కల ప్రాంతం గ్రామాలకు రోడ్డు సౌకర్యం సులభతరం అవుతుందన్నారు. నియోజకవర్గంలోని ఆరు మండలాలలో రోడ్లు లేని గ్రామాలు ఉండవని, నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయమన్నారు.
Allagadda: 8 కోట్లతో రోడ్ల అభివృద్ధి
రోడ్లు లేని గ్రామాలు ఉండవు-ఎమ్మెల్యే
సంబంధిత వార్తలు | RELATED ARTICLES