బనగానపల్లె మండలంలోని నందవరం గ్రామంలో రెండవ రోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి నిర్వహించారు. నందవరం గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గ్రామ వైయస్సార్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికి వెళ్లి జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాల పనితీరును గ్రామ ప్రజలతో స్వయంగా అడిగి తెలుసుకోవడమే కాకుండా అర్హులైన వారికి ఇంకా ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధి పొందనట్లయితే జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా లబ్ధి పొందాలని ప్రజలకు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ 3,648 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించి ప్రజల కష్టసుఖాలను ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా స్వయంగా తెలుసుకున్న నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో ఇప్పటికే 98% మేర నెరవేర్చిన ఘనత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనన్నారు.
ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి శివరామయ్య,పిఆర్ వెంకటేశ్వర రెడ్డి,PL తులసి రెడ్డి, ,గ్రామ వైఎస్ఆర్పార్టీనాయకులు,కార్యకర్తలు ,మండల అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు గృహసారథులు పాల్గొన్నారు.