Monday, November 25, 2024
Homeహెల్త్Tomato packs for skin probs: చర్మ సమస్యలకు టొమాటో ప్యాక్స్

Tomato packs for skin probs: చర్మ సమస్యలకు టొమాటో ప్యాక్స్

టమోటాలను లవ్ ఆపిల్ అంటారు, ఈ లవ్ ఆపిల్స్ లో మీ స్కిన్ లవ్లీగా తయారవుతుంది

టొమాటోల వల్ల చర్మానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. స్కిన్ ట్యాన్ పోగొట్టడంలో టొమాటో ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. సన్ బర్న్స్ నివారిస్తుంది. చర్మ  రంధ్రాలను బిగువుగా ఉండేలా చేస్తుంది. అంతేకాదు చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. టొమాటోలను చర్మంపై రాసుకోవడం వల్ల యాక్నే బ్రేకవుట్లు తగ్గుతాయి. టొమాటోలోని యాంటిబాక్టీరియల్ గుణాల వల్ల చర్మంపై ఉండే మ్రుతకణాలు పోతాయి. టొమాటో ఇరిటేట్ చేస్తే బ్లాక్ హెడ్స్ ను పోగొట్టడమే కాకుండా ముక్కు దగ్గర చర్మాన్ని మ్రుదువుగా చేస్తుంది. టొమాటో రసం చర్మానికి కావలసిన మాయిశ్చరైజర్ ని అందిస్తుంది. చర్మాన్ని మ్రుదువుగా, పట్టులా చేస్తుంది. ముడతలు, మచ్చలు, అదనపు నూనె స్రావాలు వంటి చర్మ సమస్యలు టొమాటో వల్ల తగ్గుతాయి.

- Advertisement -

చర్మం వేగంగా కాంతివంతం అయ్యేలా టొమాటోలు పనిచేస్తాయి. బొప్పాయి సగం ముక్క తీసుకుని దాని మీద ఉండే తొక్క తీసేసి ముక్కలుగా చేయాలి. ఒక టొమాటో, అరటేబుల్ స్పూన్ తేనె లను కూడా రెడీగా పెట్టుకోవాలి. ఈ మూడింటినీ కలిపి మెత్తటి పేస్టులా గ్రైండ్ చేయాలి. ఈ పేస్టును ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. టొమాటో, బొప్పాయి మిశ్రమం చర్మాన్ని ఎంతో కాంతివంతం చేస్తుంది. తేనె చర్మాన్ని మ్రదువుగా చేస్తుంది.

రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టి, ఒక టొమాటో పండు జ్యూసు, పాలు ఈ మూడింటినీ కలిపి మెత్తటి, చిక్కటి పేస్టా చేసి చర్మానికి, మెడకు, చేతులకు బ్రష్ తో రాసుకోవాలి. ఈ మూడూ మంచి క్లీన్సర్లుగా పనిచేస్తాయి. మ్రుతకణాలను పోగొడతాయి. చర్మాన్ని మెరిపిస్తాయి. పొడి చర్మంపై కూడా టొమాటో ఫేస్ ప్యాక్ బాగా పనిచేస్తుంది. ఇందుకు అరటిపండు అరముక్క, టొమాటో ఒకటి, అర టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి. అరటిపండును ముక్కలుగా చేసి మిక్సీలో వేయాలి. అందులో టొమాటో, అరటేబుల్ స్పన్ ఆలివ్ ఆయిల్ కూడా వేసి పేస్టులా చేయాలి. ఈ పేస్టు ముఖ్యంగా అందులోని అరటిపండు పొడిచర్మంపై బాగా పనిచేస్తుంది. ఇవి చర్మానికి తగినంత మాయిశ్చరైజర్ ని అందిస్తాయి. వ్రుద్ధాప్య ఛాయలు కనిపించకుండా చేస్తాయి. జిడ్డు చర్మానికి కూడా టొమాటో ఫేస్ మాస్కు బాగా పనిచేస్తుంది.

అరకప్పు ఓట్మీల్, ఒక టొమాటో, కీరకాయ అరముక్క తీసుకోవాలి. ఓట్మీల్ ను పొడిలా చేసి అందులో టొమాటో, కీరకాయ ముక్కలు వేసి మెత్తగా పేస్టులా గ్రైండ్ చేయాలి. దాన్ని ముఖానికి రాసుకొని పది నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. చర్మంలోని నూనె గ్రంధులను పీల్చే గుణం ఓట్మీల్ కు ఉంది. కీరకాయ, టొమాటోలు రెండింటిలోనూ నీరు బాగా ఉంటుంది. ఇవి చర్మంలోని నూనెను పోగొట్టి తగినంత మాయిశ్చరైజర్ ని అందిస్తుంది. మ్రుదువైన చర్మం ఉన్నవారిపై కూడా టొమాటో మంచి ఫలితాలను చూపుతుంది. దీనికి అలొవిరా జెల్, టొమాటో అవసరమ్వుతాయి. అలొవిరా ఆకు నుంచి జెల్ ని తీయాలి. దాన్ని టొమాటో జ్యూసుతో కలపి ఆ మిశ్రమాన్ని ముఖానికి వ్రుత్తాకారంలో మెల్లగా మసాజ్ చేస్తూ పదిహేను నిమిషాలు రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం ఎంతో ఉత్తేజితం అవుతుంది. ట్యాన్ ట్రీట్మెంటుకు కూడా టొమాటో బాగా పనిచేస్తుంది. బాగా పండిన టొమాటో పండు తీసుకుని దాని ముక్కతో ట్యాన్ ఉన్న ప్రదేశంలో రబ్ చేయాలి. ఇలా తరచూ చేస్తుండడం వల్ల చర్మంపై మంచి ఫలితం కనిపిస్తుంది. యాక్నే పైనా, యాక్నే మచ్చలపైన కూడా టొమాటో బాగా పనిచేస్తుంది. కొన్నిపుదీనా ఆకులు, ఒక టొమాటో పండు రెడీ పెట్టుకోవాలి. పుదీనా ఆకులు యాక్నే నుంచి సాంత్వన నిస్తాయి. అలాగే యాక్నే మచ్చలను పోగొట్టడంలో కూడా ఎంతో వేగంగా పనిచేస్తాయి.

పుదీనా ఆకులను, బాగా పండిన టొమాటో పండు రెండింటినీ కలిపి మిక్సీలో వేసి మెత్తటి పేస్టులా చేయాలి. దాన్ని ముఖానికి రాసుకుని పది నిమిషాలు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత నీళ్లతో ముఖాన్ని బాగా కడుక్కోవాలి. బ్లాక్ హెడ్స్ ను పోగొట్టడంలో కూడా టొమాటో ఫేస్ మాస్కు బాగా పనిచేస్తుంది. ఇందుకు రెండు టేబుల్ స్పూన్ల చక్కెర, ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టొమాటో పండు తీసుకోవాలి. చక్కెర మంచి ఎక్స్ ఫొయిలేటర్, ఇది చర్మంపై ఉండే మ్రతకణాలను పోగొడుతుంది. తేనె ఆ ప్రదేశాన్ని మ్రుదువుగా, కాంతివతంగా చేస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల చక్కెరలో ఒక టేబుల్ స్పూన్ తేనె, బాగా పండిన టొమాటో పండు అరముక్క వేసి ఆ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ మీద రాసి పది నిమిషాలు అలాగే వదిలేయాలి. మచ్చలను కూడా టొమాటో ఫేస్ మాస్కు పోగొడుతుంది. అరకప్పు పెరుగు, ఒక టొమాటో తీసుకుని ఆ మిశ్రమాన్ని ముఖంపై రబ్ చేసుకోవాలి. కావాలనుకుంటే ఈ మిశ్రమంలో నిమ్మరసం కూడా పిండవచ్చు.

పెరుగు చర్మానికి మాయిశ్చరైజర్ ని అందిస్తుంది. క్లియర్ స్కిన్ కు కూడా టొమాటో ఫేస్ మాస్కు బాగా పనిచేస్తుంది. అవకెడో, టొమాటో రెడీ పెట్టుకోవాలి. అవకెడోలో ఆరోగ్యవంతమైన ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి చర్మాన్ని అద్దంలా ఉంచడమే కాదు చర్మానికి ఆరోగ్యవంతమైన మెరుపును ఇస్తాయి. అవకెడో, టొమాటో ముక్కలను గ్రైండ్ చేసి మెత్తటి పేస్టులా చేసి దాన్ని ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాలు అలాగే వదిలేయాలి. ఇలా ఎన్నో చర్మ సమస్యల పరిష్కారానికి టొమాటో ఫేస్ ప్యాకులు ఎంతో బాగా పనిచేస్తాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News