Friday, September 20, 2024
HomeతెలంగాణTandur: మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు

Tandur: మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు

సమగ్ర విచారణ జరిపి వారం రోజుల్లో చర్య తీసుకోండి

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కళాశాలలో జరుగుతున్న అవినీతి అక్రమాలను అరికట్టాలని బిఆర్ఎస్వీ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, బిఆర్ఎస్వి ఇంచార్జ్ జిలాని మాట్లాడుతూ
విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టకపోవడం, ఎలాంటి పత్రిక ప్రకటన నోటిఫికేషన్ సమాచారం లేకుండా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను అక్రమ పద్ధతిలో భర్తీ చేయడం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బిసి తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్లో ఏ ఒక్క పోస్టు ఖాళీ ఉన్నా పత్రిక ప్రకటన ఇచ్చి జిల్లా స్థాయిలో డెమోలు తీసుకొని భర్తీ చేస్తారు. విద్యార్థులకు అడ్మిషన్ కూడా ఎగ్జామ్స్ నిర్వహించి ఫస్ట్ సెకండ్ మరియు మూడవ లిస్టు ద్వారా సెలెక్ట్ చేసి అడ్మిషన్ ప్రాసెస్ చేసి పూర్తి చేస్తారు. కానీ ఈ మైనారిటీతో పాటశాల, కళాశాలల్లో మాత్రం ఈ యొక్క మైనార్టీ స్కూల్లో 2016లో స్థాపించారు. అప్పటినుండి ఇప్పటివరకు విద్యార్థులకు ఎలాంటి ఎగ్జామ్స్ పెట్టకుండా లాటరీ సిస్టమ్ అంటూ లోపల పెద్ద ఎత్తున అడ్మిషన్లలో కూడా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. ఎందుకిలా జరుగుతున్నాయి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలు న్యాయబద్ధంగా నడుస్తున్నాయి కానీ మైనార్టీ స్కూల్లో మాత్రం తమ సొంత నిర్ణయాలతో తాము చెప్పిందే చట్టంలా నియంత పాలన కొనసాగిస్తూ ఎన్నో అవినీతి అక్రమ జరుగుతున్న తమకేమీ పట్టనట్టు జిల్లా కలెక్టర్ చోద్యం చూస్తున్నారు.

- Advertisement -

తాండూర్ లో గర్ల్స్, బాయ్స్ లో అదేవిధంగా కొడంగల్ జూనియర్ కళాశాలలో ఎలాంటి పత్రిక ప్రకటన నోటిఫికేషన్ లేకుండా ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలను అక్రమ పద్ధతిలో గత మూడు సంవత్సరాల నుంచి భర్తీ చేయడం కొనసాగుతుంది, కావున ఇలాంటి చట్టవృద్ధంగా నియమాకాలు చేస్తున్న అధికారులు ఏజెన్సీపై కూడా చర్యలు తీసుకొని తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల కోసం వేయి యొక్క గురుకుల ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యతోపాటు పౌష్టిక ఆహారం అందిస్తుంటే కొందరు ఒక గ్రూపుగా ఏర్పడి విద్యార్థులకు అందవలసిన వాటిని అందకుండా మింగేస్తున్నారు. అసలు వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మైనార్టీ స్కూల్లో గుడ్డు పెట్టడం లేదు. ప్రిన్సిపల్స్ కొంతమంది ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదు, ఇష్టం వచ్చినట్లు రావడం పోవడం జరుగుతుంది. వీటన్నింటిపై సమగ్ర విచారణ జరిపి వారం రోజుల్లో చర్య తీసుకోవాలని తాండూరులో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి తీర్మానించడం జరిగింది. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యేకు, జిల్లా మంత్రి సబితా రెడ్డికి ఫిర్యాదు చేస్తామని అవసరమైతే సంబంధిత శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ని కూడా కలిసి సమస్యను వివరిస్తామని వారు తెలిపారు. సమస్య పరిష్కారం అయ్యేంతవరకు ఈ ఉద్యమాన్ని ఆపేది లేదని తేల్చి చెప్పారు. అక్రమ పద్ధతిలో నియమించిన వారు అందరిని కూడా తొలగించి మళ్లీ న్యాయబద్ధంగా ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు ఈ.శ్రీనివాస్, బిఆర్ఎస్వి ఇంచార్జ్ జిలాని, గోర్ బంజారా వెల్ఫేర్ జిల్లా కార్యదర్శి అరుణ్ నాయక్, టిఆర్ఎస్వి వైస్ ప్రెసిడెంట్ ఆకిఫ్, సెక్రటరీ నాసిర్ ఖాన్, బీసీ నాయకులు రాము ముదిరాజ్, రమేష్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News