Friday, September 20, 2024
HomeతెలంగాణBonalu in Singapore: సింగపూర్ లో ఘనంగా బోనాలు

Bonalu in Singapore: సింగపూర్ లో ఘనంగా బోనాలు

సింగపూర్ దేశంలో తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం బోనాల పండుగ ను శ్రీ అరిషకేసరి ఆలయంలో అత్యుత్తమ భక్తి శ్రద్ధలతో బోనాలు పోతరాజు వేషాలతో యువకులు, మహిళలు, పిల్లలు నృత్యాలతో ఘనంగా జరుపుకున్నారు. మహిళలు ఊరోగింపుగా వచ్చి దుర్గాదేవికి బోనాల సమర్పించుకున్నారు. ఆ తరువాత తీర్థ ప్రసాదం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినారు. సుమారు 500 మంది కార్యక్రమంలో పాల్గొన్నారు. దుర్గాదేవికి బోనాలు సమర్పించిన దంపతులు బోయిని సమ్మయ్య- స్వరూప, పెద్ది చంద్రశేఖర్ రెడ్డి- కవిత, వేముల సురేష్- సౌజన్య, కట్లకుంట శ్రీనివాస్ రెడ్డి- లావణ్య బోనాలు సమర్పించిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షులు, కమిటీ సభ్యులు, ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజర్ బోయిన సమ్మయ్య, శ్రీనివాస్ రెడ్డి, జితేందర్ రెడ్డి, రమణ, బైరి రవి, శశి, ఎస్ కిరణ్, విజయ్, విక్రమ్, సందీప్, కోటి, సలహాదారులు శ్రీనివాస్ రెడ్డి, పెద్ది చంద్రశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొని బోనాల పండుగను విజయవంతం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News